అప్పుల తెలంగాణ‌.. జుట్టుకు రూ.ల‌క్ష పైనే

Telangana Budget 2023-24 రుణం రూ.4.62 ల‌క్ష‌ల కోట్లు ఈ ఏడాది మ‌రో 51.277 కోట్ల అప్పుకు ప్ర‌తిపాద‌న‌లు వ‌డ్డీ, అస‌లు చెల్లింపులు ఏడాదికి రూ. రూ.63,493 కోట్లు సొంత ఆదాయంలో స‌గం చెల్లింపులు అప్పుల‌కే పూట గ‌డ‌వాలంటే అప్పులు చేయాల్సిందే విధాత‌: బంగారు తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకు పోయింది. పూట గ‌డ‌వాలంటే అప్పులు చేయాల్సిన ప‌రిస్థితికి నెట్ట‌బ‌డింది. తెచ్చిన అప్పులు కూడ చెల్లింపుల‌కు స‌రిపోవ‌డం లేద‌ని బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతున్న‌ది. ఈ ఏడాది […]

  • By: krs    latest    Feb 07, 2023 12:22 AM IST
అప్పుల తెలంగాణ‌.. జుట్టుకు రూ.ల‌క్ష పైనే

Telangana Budget 2023-24

  • రుణం రూ.4.62 ల‌క్ష‌ల కోట్లు
  • ఈ ఏడాది మ‌రో 51.277 కోట్ల అప్పుకు ప్ర‌తిపాద‌న‌లు
  • వ‌డ్డీ, అస‌లు చెల్లింపులు ఏడాదికి రూ. రూ.63,493 కోట్లు
  • సొంత ఆదాయంలో స‌గం చెల్లింపులు అప్పుల‌కే
  • పూట గ‌డ‌వాలంటే అప్పులు చేయాల్సిందే

విధాత‌: బంగారు తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకు పోయింది. పూట గ‌డ‌వాలంటే అప్పులు చేయాల్సిన ప‌రిస్థితికి నెట్ట‌బ‌డింది. తెచ్చిన అప్పులు కూడ చెల్లింపుల‌కు స‌రిపోవ‌డం లేద‌ని బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతున్న‌ది. ఈ ఏడాది ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసే నాటికి రాష్ట్ర అప్పు రూ.4.62 ల‌క్ష‌ల కోట్ల పైచిలుకే ఉంది. రాష్ట్ర బ‌డ్జెట్ కంటే అప్పే ఎక్కువ‌గా ఉన్న‌ది. రాష్ట్రంలో దాదాపు 4 కోట్లకు పైగా జ‌నాభా ఉన్న‌ది. రాష్ట్ర ప్ర‌భుత్వం, ప్ర‌భుత్వ సంస్థ‌లు చేసిన అప్పు ఒక్కొక్క‌రికి ల‌క్ష రూపాయ‌ల‌కు పైగా ప‌డుతుందని బ‌డ్జెట్ లెక్క‌లు తెలుపుతున్నాయి.

రూ. 2.90 ల‌క్ష‌ల కోట్ల బడ్జెట్ ప‌ద్దులో రాష్ట్ర సొంత ఆదాయం రూ.1.31 కోట్ల పైచిలుకు మాత్ర‌మే. గ్రాంట్ ఇన్ ఎయిడ్స్‌, కేంద్ర ప‌న్నుల్లో రాష్ట్ర వాటా రూ.62వేల కోట్ల పైచిలుకు కాగా, నాన్‌ టాక్స్ రెవెన్యూ (ఎక్కువ భాగం భూముల అమ్మ‌కాల ద్వ‌రా వ‌చ్చే ఆదాయం రూ.22.808 కోట్లు చూపించారు. ఈ ఏడాది రూ.51 వేల కోట్ల పైచిలుకు అప్పులు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఈ మేర‌కు బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించారు. అయితే కేంద్రం ఎఫ్ ఆర్ బీఎం ప‌రిధిలోకి ప్ర‌భుత్వ సంస్ఠ‌ల రుణాలు కూడ చేర్చి తెలంగాణ తీసుకునే అప్పుల‌పై ఆంక్ష‌లు కూడ విధించింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పులు చేయ‌కుంటే రాష్ట్ర ఎలా అభివృద్ది చెందుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్న‌ది. ఈ ఏడాది మార్చిలో ముగియ‌నున్న ఆర్థిక సంవ‌త్స‌రానికి రుణాల‌పై కోత‌లు విధించ‌డాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం త‌ప్పు ప‌ట్టింది. ఈ మేర‌కు త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో హ‌రీశ్‌రావు వివ‌రించారు.

వాస్త‌వంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే భారీగా అప్పులు చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌హిరంగ మార్కెట్‌లో తెచ్చినవి, పూచిక‌త్తు రుణాలు, ఇత‌ర‌త్రా క‌లిసి రూ.4. 62 ల‌క్ష‌ల కోట్ల పైచిలుకు అప్పు 2023 మార్చి 31వ తేదీ నాటికి ఉన్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకువ‌చ్చిన రుణాల‌కు వ‌డ్డీలు, అస‌లు క‌లిపి ఈ ఏడాది రూ.63,493 కోట్లు చెల్లించాల్సి ఉంది.

వ‌చ్చిన ఆదాయంలో తిన్నా, తిన‌కున్నా మార్కెట్‌లో ప‌ర‌ప‌తి ఉండాలంటే ఈ మేర‌కు చెల్లింపులు చేయాల్సిందే… స‌రాస‌రిన నెల‌కు రూ. 5291.14 కోట్లు వ‌డ్డీలు, అస‌లు కింది తెచ్చిన అప్పుల‌కు చెల్లింపులు చేయాలి. ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్న ఇది ప‌చ్చి నిజం. ఈరుణ వాయిదాల‌ చెల్లింపులో ఏమాత్రం జాప్యం జ‌రిగినా… పుట్ట‌గ‌తులు కూడ ఉండ‌వు… దీంతో ఆదాయం రాకున్నా రుణ‌వాయిదాలు చెల్లించాలంటే తిరిగి అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఏర్ప‌డింది.

ఈ ఏడాది బ‌డ్జెట్ అంచ‌నాల ప్ర‌కారం రాష్ట్ర సొంత ఆదాయం రూ.1.31,028 కోట్లు.. ఇందులో నుంచి తెచ్చిన అప్పుల కింద వ‌డ్డీలు, అస‌లు చెల్లించ‌డానికి రూ. 63,493 కోట్లు పోతుంది. వ‌డ్డీ, అస‌లు చెల్లింపులు పోగా రూ.67,535 కోట్లు మాత్రమే సొంత ఆదాయం మిగులుతుంది. ఇందులో నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగుల జీత‌భ‌త్యాలు, ఖ‌ర్చు 010 ప‌ద్దు కింద చెల్లించేవి నెల‌కు రూ 3 వేల కోట్ల వ‌ర‌కు ఉంటుంది.

ఇది ఏడాది రూ.36 వేల‌కోట్లు జీత భ‌త్యాల‌కే ఖ‌ర్చు అవుతుంది. 010 జీరో ప‌ద్దు కాకుండా ఇత‌ర‌త్రా చెల్లించే వేత‌నాలు అద‌నం… అయితే ఈ ఏడాది జ‌రుగుతున్న కొత్త రిక్రూట్ మెంట్ ద్వారా నియ‌మితుల‌య్యే ఉద్యోగుల వేత‌నాల ఖ‌ర్చు మ‌రో వేయి కోట్ల‌కు చేరుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వేత‌నాల‌తో పాటు ఇత‌ర ఖ‌ర్చులకు సొంత ఆదాయం అంతా ఖ‌ర్చు కానున్న‌ది. దీంతో ఇత‌ర అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు కేంద్ర ప‌న్నులో వాటాతో పాటు, భూముల అమ్మ‌కాలు, అప్పుల‌పైనే ఆధార ప‌డాల్సిన ప‌రిస్థితి తెలంగాణ ప్ర‌భుత్వానికి ఏర్ప‌డింది.

బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల ఆధారంగా రాష్ట్ర ప్ర‌భుత్వ అప్పుల వివ‌రాలు ఇలా..

ప్ర‌భుత్వం నేరుగా తీసుకున్న బ‌డ్జెట్ రుణాలు 2022మార్చి 31 నాటికి రూ. 2,77,489 కోట్లు

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో తీసుకున్న రుణాలు

రూ. 50,382 కోట్లు
మొత్తం బ‌డ్జెట్ రుణాలు రూ. 3,27,871 కోట్లు
ప్ర‌భుత్వ పూచిక‌త్తు రుణాలు(బ‌డ్జెటేత‌ర రుణాలు 2023 జ‌న‌వ‌రి31) రూ. 1,35,282 కోట్లు
మొత్తం తెలంగాణ ప్ర‌భుత్వ రుణాలు రూ. 4,63,153 కోట్లు