Deepika Padukone | దీపికా.. ఏంది మరీ ఇలా తయారైంది.. అసలా డ్రస్సేంటో? ఆ ఆరబోత ఏంటో?

Deepika Padukone పట్టుదల విషయానికి వస్తే మగాళ్ళకంటే ఆడవాళ్ళు కాస్త రెండు మెట్లు ముందే ఉంటారనే విషయంలో అప్పుడప్పుడూ సాక్ష్యాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇక గ్లామర్ ఆరబోతలో మగాళ్ళు షర్ట్ విప్పేసి కండలు చూపించే ట్రెండ్ నడుస్తుంటే, అమ్మాయిలు అయితే చిట్టిపొట్టి దుస్తుల్లో కనిపించి కుర్రకారుకు కిక్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటి హీరోయిన్స్ ఈ రూట్‌లో ఉంటే స్టార్ హీరోయిన్‌గా మంచి పేరుండి, మరో స్టార్ హీరోకి భార్య అయ్యి కూడా ఆమె ఇలా బికినీలో కనిపించడం, హాట్ […]

Deepika Padukone | దీపికా.. ఏంది మరీ ఇలా తయారైంది.. అసలా డ్రస్సేంటో? ఆ ఆరబోత ఏంటో?

Deepika Padukone

పట్టుదల విషయానికి వస్తే మగాళ్ళకంటే ఆడవాళ్ళు కాస్త రెండు మెట్లు ముందే ఉంటారనే విషయంలో అప్పుడప్పుడూ సాక్ష్యాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇక గ్లామర్ ఆరబోతలో మగాళ్ళు షర్ట్ విప్పేసి కండలు చూపించే ట్రెండ్ నడుస్తుంటే, అమ్మాయిలు అయితే చిట్టిపొట్టి దుస్తుల్లో కనిపించి కుర్రకారుకు కిక్ ఇచ్చేస్తున్నారు.

ఇప్పటి హీరోయిన్స్ ఈ రూట్‌లో ఉంటే స్టార్ హీరోయిన్‌గా మంచి పేరుండి, మరో స్టార్ హీరోకి భార్య అయ్యి కూడా ఆమె ఇలా బికినీలో కనిపించడం, హాట్ హాట్ ఫోటోలతో కాకరేపడం చూసిన జనాలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా? ప్రభాస్ ‘కల్కి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్న దీపికా పదుకొణె.

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మొదటి నుంచి ఇదే పంథాలో వెళుతుంది. మొన్నామధ్య చేసిన ‘పఠాన్’ సినిమాలో ఆమె గ్లామర్ డోస్‌కి అంతా ఫిదా అయిపోయారు. ఇంతకు ముందు ఏ హీరోయిన్ చేయని విధంగా చిన్న పీలికల డ్రస్సులో ఓ పాటలో రెచ్చిపోయింది. అయితే అది సినిమాలే అనుకున్న జనాలకు ఇప్పుడు ఫోటో షూట్స్‌తో కూడా రెచ్చగొట్టే పనిలో ఉంది దీపిక.

తాజాగా ఓ ఫోటో షూట్‌లో ఏకంగా బికినీ బాటమ్ తీసేస్తూ మరీ ఫోటోషూట్ చేసింది. దీనితో సోషల్ మీడియాలో దీపిక పదుకొనే బికినీ ఫొటోస్ వైరల్ గా మారాయి. కుర్రకారును హీట్ ఎక్కించే పనిలో ఇంతగా దిగజారిపోతుందేంటనే కామెంట్స్ చేస్తున్నా.. అవేం పట్టించుకునే పనిలో లేదు దీపిక.

బోల్డ్ గా కనిపించడానికి ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. నేనింతే.. నేను ఇలానే ఉంటానంతే.. అనే వైఖరిలో మాట్లాడే దీపిక, మగాళ్ళకు ఏం తీసిపోనంటూ ఇలా ప్రవర్తించడం ఇప్పుడు ఒకింత ఆశ్చర్యం.. మరొకింత విడ్డూరంగా మారుతోంది. పేరు, డబ్బు ఉంటే ఇదేం పోయేకాలమో.. ఈ సినీ జనాలు ఇలా ఎందుకు తయారవుతారో అంటూ దీపికా అవతారంపై నెట్టింట్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు కొందరు నెటిజన్లు.