దీపిక ‘బికినీ’ తెచ్చిన హిట్‌.. వెయ్యి కోట్ల కలెక్షన్స్‌?

విధాత‌, సినిమా: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు గత పదేళ్లుగా సరైన హిట్ లేదు. ఆయన నటించిన పఠాన్ చిత్రం కూడా విడుదలకు ముందే చాలా మంది ఇది ఆడే అవ‌కాశం లేద‌ని తేల్చారు. కానీ ఆ తర్వాత విడుదల చేసిన పాట పెద్ద వివాదానికే దారి తీసి అసలు సినిమా విడుదల అవుతుందా అన్న డౌటనుమానాలు చాలామందికి వచ్చాయి. ఆ పాటలో దీపికా పడుకొనే వేసిన కాషాయపు రంగు బికినీ, ఆమె ప్రైవేటు పార్ట్స్ పై […]

  • Publish Date - February 20, 2023 / 12:26 PM IST

విధాత‌, సినిమా: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు గత పదేళ్లుగా సరైన హిట్ లేదు. ఆయన నటించిన పఠాన్ చిత్రం కూడా విడుదలకు ముందే చాలా మంది ఇది ఆడే అవ‌కాశం లేద‌ని తేల్చారు. కానీ ఆ తర్వాత విడుదల చేసిన పాట పెద్ద వివాదానికే దారి తీసి అసలు సినిమా విడుదల అవుతుందా అన్న డౌటనుమానాలు చాలామందికి వచ్చాయి.

ఆ పాటలో దీపికా పడుకొనే వేసిన కాషాయపు రంగు బికినీ, ఆమె ప్రైవేటు పార్ట్స్ పై షారుక్ చేతులు వేయడం వంటివి వివాదాన్ని రేపాయి. ఏకంగా సాధువులు, హిందూ సంఘాలు రోడ్ల మీదకు వచ్చి షారుక్ దిష్టిబొమ్మలను దహనం చేసే స్థాయిలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది.

అయితే కాషాయపు రంగు బికినీ వివాదం సినిమా ఓపెనింగ్స్ విషయంలో పఠాన్‌కి చాలా హెల్ప్ అయింది. అదే సినిమాకు ఆ రేంజీలో ఓపెనింగ్స్ రాకుండా ఉంటే సినిమాపై ఖచ్చితంగా నెగటివ్ టాక్ వచ్చి ఈ స్థాయి కలెక్షన్లు వచ్చి ఉండేవి కావు.

ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ వల్లే పాజిటివ్ టాక్ వ‌చ్చి ఇప్పుడు ఏకంగా 900 కోట్ల వసూళ్లకు దగ్గరగా వచ్చాయని తెలుస్తోంది. మొత్తానికి పఠాన్ బికినీ వ్యవహారం మాత్రం ఆ చిత్రం నిర్మాత, దర్శకుడు, షారుఖ్‌లకు చాలా హెల్ప్ చేసింది. వారి స్టార్‌డంను కాపాడి మరో పదేండ్లు నిలిచేలా చేసింది.

ముసలోడికి దసరా పండగ అంటే ఇదే!

కాబట్టి మన రోడ్ల మీదకు వస్తే అది ఆయా చిత్రాలకు మరింత పబ్లిసిటీని ఇచ్చినట్టు అవుతుంది. వారు డబ్బు పెట్టి పబ్లిసిటీ చేసుకోకుండా మనం ఉచిత పబ్లిసిటీ చేసి పెట్టినట్టుగా అవుతుంది.

కాబట్టి ప్రతి విషయానికి మనోభావాలు దెబ్బతిన్నాయని వీధికి ఎక్కి ఆయా చిత్రాలను భుజాల మీద మోసుకొని కలెక్షన్స్ పరంగా వాటికి ఇక సాయ పడకుండా ఇలాంటి వాటిని ఖండిస్తూ పోవడం మంచిదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మనం ఏమి గొడవ చేసినా అది చివరికి సినిమాలకు పబ్లిసిటీగా ఉపయోగ పడుతుంది. ఆ చిత్రాల సత్తా ఏందనేది చూసిన ప్రేక్షకులే నిర్ణయిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు..!