2014 నుంచి జరిగిన ఫిరాయింపులపై విచారణ చేపట్టాలి: రేవంత్‌రెడ్డి
తాము దళితుడిని సీఎల్పీని చేస్తే.. కేసీఆర్ 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు పరిపాలన చేయని చెప్పినా బుద్ది మార్చుకోని కేసీఆర్ మొయినాబాద్ పోలీస్టేషన్‌లో కంప్లెంట్ చేసిన తరువాత మీడియాతో రేవంత్‌రెడ్డి విధాత: తెలంగాణ ప్రత్యక రాష్ట్రంగా ఏర్పాటైన తరువాత పాలనా పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ పరిపాలనపై కాకుండా పార్టీ పిరాయింపులపై దృష్టి కేంద్రీకరించారని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ౧౨ మంది ఎమ్మెల్ల్యేలను బీఆర్‌ఎస్ కొనుగోలు చేసిందని, దీనిపై […]

- తాము దళితుడిని సీఎల్పీని చేస్తే.. కేసీఆర్ 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు
- పరిపాలన చేయని చెప్పినా బుద్ది మార్చుకోని కేసీఆర్
- మొయినాబాద్ పోలీస్టేషన్‌లో కంప్లెంట్ చేసిన తరువాత మీడియాతో రేవంత్‌రెడ్డి
విధాత: తెలంగాణ ప్రత్యక రాష్ట్రంగా ఏర్పాటైన తరువాత పాలనా పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ పరిపాలనపై కాకుండా పార్టీ పిరాయింపులపై దృష్టి కేంద్రీకరించారని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ౧౨ మంది ఎమ్మెల్ల్యేలను బీఆర్‌ఎస్ కొనుగోలు చేసిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి రేవంత్ రెడ్డి శుక్రవారం మెయినాబాద్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర పార్టీల ఎమ్మెల్ల్యేలను కొనుగోలు చేయడంపై దృష్టి కేంద్రీకరించిన సీఎం కేసీఆర్ పరిపాలనను ప్రజలను గాలికి వదిలేశాడన్నారు. తెలుగుదేశంలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చారన్నారు. ప్రజలకు ఇష్టం ఉన్న లేకపోయినా 2018లో ప్రజలు కేసీఆర్ కి సంపూర్ణ మెజారిటీ ఇచ్చారన్నారు. 2018లో బీఆర్‌ఎస్ నుంచి 88 శాసనసభ సభ్యులు గెలిచారన్నారు. అయనా ఇతర పార్టీలు రాష్ట్రంలో ఉండకూడదని, తనను ప్రశ్నించే వాళ్లు ఉండ కూడదన్న దురుద్దేశంతో పాత నేరగాళ్లలా పార్టీ పిరాయింపులను కేసీఆర్ కొనసాగించారన్నారు.
బుద్ది మార్చుకోని కేసీఆర్
తమ పార్టీ దళిత నాయకుడిని సీఎల్పీ నాయకుడిని చేస్తే… 12 మంది ఎమ్మెల్యేలను టీఆరెఎస్‌లో చేర్చుకున్నారన్నారు. పిరాయింపులపై కాకుండా పరిపాలన పై కేసీఆర్ దృష్టి పెట్టాలనితమ పార్టీ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అసెంబ్లీ లో చెప్పినా కేసీఆర్ తన బుద్ధి మార్చుకోలేదన్నారు.
ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోలే
కాంగ్రెస్ పార్టీ నేతలు పిరాయింపులపై స్పీకర్ కి పిర్యాదు చేశారని, అయినా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి18 మంది ఎమ్మెల్ల్యేలు ఉన్నారని, అయితే 12 మంది టీఆరెస్ లో చేరుతూ కాంగ్రెస్ విలీనం అని ఇచ్చారన్నారు. స్పీకర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులను పట్టించుకోలేదని, పెడ చెవిన పెట్టారన్నారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని రేవంత్ అన్నారు.
అలాగే మిగితా వారికి లంచాలు ఇచ్చి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని ఆరోపించారు. లంచం తీసుకుంటే శిక్ష అర్హులన్నారు. పైలెట్ రోహిత్‌రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి ,రేగా కాంతారావు కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్‌ఎస్‌లోకి పోయారన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి సిద్ధమయ్యారన్నారు. మొయినాబాద్‌లో ఫిర్యాదు ప్రకారం లంచం ఇవ్వదలుచుకున్నా, తీసుకున్నా నేరమన్నారు.
సీఎం కేసీఆర్ తాను చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారు
తెలంగాణ పోలీస్ విభాగం విచారణ చేసిన అంశాలను కేసీఆర్ ఇచ్చారన్నారు. తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని బీజేపీ పిటిషన్ వేసిందన్నారు. ఎమ్మెల్యేలు సత్యహరిచంద్రులు అని కేసీఆర్ పత్రిక సమావేశం పెట్టి చెప్పారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో బహిరంగ పర్చమని ప్రమాణం చేస్తామని, కానీముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించారన్నారు.
పార్టీ పిరాయించిన వారు మంత్రి పదవులు, కమిషన్లు, కాంట్రాక్ట్లు తీసుకున్నారన్నారు. తాము 9 మంది ఎమ్మెల్యే లపై పిర్యాదు చేశామన్నారు. ఎమ్మెల్ల్యేలు లబ్దిపొందిన అంశాలను సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మేము ఇచ్చిన ఆధారాలు సీబీఐకి ఇవ్వాలని చెప్పామన్నారు. అన్ని అంశాలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
పార్టీలు మారిన వారిపై సీబీఐ,ఈడికి ఫిర్యాదు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నించకుండా కుట్ర చేశారని రేవంత్ ఆరోపించారు. 2019 తరువాత పార్టీలు మరిన వారిపై సీబీఐ,ఈడీ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వారు మళ్ళీ చట్ట సభలకు రాకుండా కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందన్నారు.