ఆరు గ్యారంటీలు అమలుచేసి తీరుతాం: డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

ఆరు గ్యారంటీలు అమలుచేసి తీరుతాం: డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను అధికారంలోకి రాగానే అమలుచేసి తీరుతామని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం ఆమె మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ సాగర్ రావు తరపున ప్రచారం చేశారు.


గడప గడపకు వెళ్తూ, ఆరు గ్యారెంటీలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారంలో లేనప్పటికీ పదేళ్లుగా మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలకు తమ ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఏమిటో మంచిర్యాల ప్రజలకు తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రేమ సాగర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.