Indigo Flight | ఇండిగో విమానానికి త‌ప్పిన పెను ప్ర‌మాదం..

Indigo Flight | ఒడిశా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్ర‌మాదం త‌ప్పింది. విమానం ఇంజిన్‌లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో టేకాఫ్ అయిన 40 నిమిషాల‌కే అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ చేయాల్సి వ‌చ్చింది. పైల‌ట్ అప్ర‌మ‌త్త‌తో 180 మంది సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని బీజూ ప‌ట్నాయ‌క్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు నుంచి సోమ‌వారం ఉద‌యం 7:50 గంట‌ల‌కు ఇండిగో విమానం ఢిల్లీ బ‌య‌ల్దేరింది. విమానం గాల్లో ఉండ‌గానే.. ఇంజిన్‌లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తిన‌ట్లు పైల‌ట్ […]

  • By: raj    latest    Sep 04, 2023 9:38 AM IST
Indigo Flight | ఇండిగో విమానానికి త‌ప్పిన పెను ప్ర‌మాదం..

Indigo Flight |

ఒడిశా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్ర‌మాదం త‌ప్పింది. విమానం ఇంజిన్‌లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో టేకాఫ్ అయిన 40 నిమిషాల‌కే అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ చేయాల్సి వ‌చ్చింది. పైల‌ట్ అప్ర‌మ‌త్త‌తో 180 మంది సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని బీజూ ప‌ట్నాయ‌క్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు నుంచి సోమ‌వారం ఉద‌యం 7:50 గంట‌ల‌కు ఇండిగో విమానం ఢిల్లీ బ‌య‌ల్దేరింది. విమానం గాల్లో ఉండ‌గానే.. ఇంజిన్‌లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తిన‌ట్లు పైల‌ట్ గుర్తించాడు.

దీంతో విమానాన్ని మ‌ళ్లీ భువ‌నేశ్వ‌ర్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశాడు. టేకాఫ్ అయిన 40 నిమిషాల‌కు విమానాన్ని బీజూ ప‌ట్నాయ‌క్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేసిన‌ట్లు ఇండిగో అధికారులు తెలిపారు.

అయితే విమానాన్ని ప‌క్షి ఢీకొట్ట‌డంతోనే ఎడ‌మ‌వైపు ఇంజిన్‌లో సాంకేతిక స‌మ‌స్య ఏర్ప‌డిన‌ట్లు భావిస్తున్నామ‌ని పేర్కొన్నారు. మొత్తానికి పైల‌ట్ అప్ర‌మ‌త్త‌తో 180 మంది ప్ర‌యాణికులు సుర‌క్షితంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌యాణికులంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.