బాలుడిపై గ్యాంగ్‌రేప్‌.. ప్రైవేటు భాగాల్లో రాడ్లు!

విధాత: దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. కామంతో చెల‌రేగిపోయిన ఓ న‌లుగురు వ్య‌క్తులు.. ఓ 12 ఏండ్ల బాలుడి ప‌ట్ల‌ క్రూర మృగాల్లా ప్ర‌వ‌ర్తించారు. అత‌నిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డి, ప్రైవేటు భాగాల్లో రాడ్ల‌ను చొప్పించి, తీవ్రంగా హింసించారు. ఈ ఘ‌ట‌న‌పై ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ సంద‌ర్భంగా మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ స్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో అబ్బాయిలు కూడా సుర‌క్షితంగా ఉండ‌లేక‌ పోతున్నారు. ఓ […]

బాలుడిపై గ్యాంగ్‌రేప్‌.. ప్రైవేటు భాగాల్లో రాడ్లు!

విధాత: దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. కామంతో చెల‌రేగిపోయిన ఓ న‌లుగురు వ్య‌క్తులు.. ఓ 12 ఏండ్ల బాలుడి ప‌ట్ల‌ క్రూర మృగాల్లా ప్ర‌వ‌ర్తించారు. అత‌నిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డి, ప్రైవేటు భాగాల్లో రాడ్ల‌ను చొప్పించి, తీవ్రంగా హింసించారు. ఈ ఘ‌ట‌న‌పై ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఈ సంద‌ర్భంగా మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ స్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో అబ్బాయిలు కూడా సుర‌క్షితంగా ఉండ‌లేక‌ పోతున్నారు. ఓ న‌లుగురు వ్య‌క్తులు క‌లిసి 12 ఏండ్ల బాలుడిని అత్యాచారం చేయ‌డం దారుణ‌మ‌న్నారు. అత‌న్ని తీవ్రంగా క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాది వ‌దిలి పెట్ట‌డం తీవ్ర‌మైన నేర‌మ‌ని ఆమె పేర్కొన్నారు.

న‌లుగురు నిందితుల్లో ఒక‌ర్ని అరెస్టు చేయ‌గా, మిగ‌తా ముగ్గురు ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే సెప్టెంబ‌ర్ 18న 12 ఏండ్ల అబ్బాయిని కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు బాధితుడి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అత‌ని ప్రైవేటుప్ర‌యివేటు భాగాల్లో ఇనుప రాడ్లు చొప్పించార‌ని తెలిపారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు.