గర్భిణీ మృతి ఘటనపై విచారణ.. డీఎంఈ, ఎమ్మెల్యేల నిలదీత
విధాత, నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో తాజాగా డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యంతో మృతి చెందిన గర్భిణీ అఖిల ఘటనపై విచారణ చేపట్టిన డీఎంఈ రమేష్ రెడ్డి సోమవారం ఆసుపత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. ఆసుపత్రిలోని వార్డులను తనిఖీ చేసిన డీఎంఈ ఎక్కడ క్లీన్‌గా లేకపోవడంతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవల తీరుపైఆగ్రహం వ్యక్తంచేశారు. డీఎంఈ రమేశ్ రెడ్డి రాకను తెలుసుకుని ఆసుపత్రికి చేరుకున్న నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి రమేశ్ రెడ్డి […]

విధాత, నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో తాజాగా డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యంతో మృతి చెందిన గర్భిణీ అఖిల ఘటనపై విచారణ చేపట్టిన డీఎంఈ రమేష్ రెడ్డి సోమవారం ఆసుపత్రిని సందర్శించి విచారణ చేపట్టారు.

ఆసుపత్రిలోని వార్డులను తనిఖీ చేసిన డీఎంఈ ఎక్కడ క్లీన్‌గా లేకపోవడంతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవల తీరుపైఆగ్రహం వ్యక్తంచేశారు. డీఎంఈ రమేశ్ రెడ్డి రాకను తెలుసుకుని ఆసుపత్రికి చేరుకున్న నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి రమేశ్ రెడ్డి హాస్పిటల్ వార్డులను తనిఖీ చేశారు.

ఈ క్రమంలో పేషెంట్లు, పేషెంట్ తరపు బంధువులు ఆసుపత్రి వసతుల అద్వాన్నంగా ఉన్నాయని, వైద్య సేవలు సరైన పద్ధతిలో అందడం లేదని వారిని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు లేవని, మీ కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తే ఇలాంటి ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటారా అంటూ మండిపడ్డారు.

పరిస్థితిని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే కంచర్ల సూపరింటెండెంట్ లచ్చిరాం నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సరైన వైద్య సేవలు అందించడం చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపో అంటూ మండి పడ్డారు.
