ఫార్ములా ఈ రేస్‌ వెనుక ఇంత అవినీతి ఉన్నదా?

తెలంగాణ ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర వనరుల సంరక్షణకే ఫార్ములా ఈ రేస్ రద్దు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు

  • By: Somu    latest    Jan 09, 2024 12:05 PM IST
ఫార్ములా ఈ రేస్‌ వెనుక ఇంత అవినీతి ఉన్నదా?
  • ప్రజాప్రయోజనాల కోసమే రేస్ రద్దు
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క    

విధాత : తెలంగాణ ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర వనరుల సంరక్షణకే ఫార్ములా ఈ రేస్ రద్దు చేశామని ప్రజాప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం ఎవరికి తలవంచేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. “పార్ములా ఈ-రేస్ నిర్వహించకపోవడం వల్ల రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిందని బీఆరెస్ మాజీ మంత్రులు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు.


ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తున్నారన్నారు. అందుకే వాస్తవాలు ప్రజలకు తెలియ చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వంకు, పార్ములా ఈ-రేస్, ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థల మధ్య ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగిందన్నారు. 30.10.23 రోజు అగ్రిమెంట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై తర్వాతా చెబుతామన్నారు. రాష్ట్రంలో ఈవెంట్ కండక్ట్ చేస్తే ఈ ముగ్గురు వాటాలు పంచుకుంటారని, టికెట్స్ అమ్ముకున్నది ఒకరు..ఫార్ములా రేస్ నిర్వహించింది ఒకరని, రాష్ట్ర పాత్ర ట్రాక్ తయారు చేయడమేనన్నారు.


రేస్ ద్వారా టికెట్లు అమ్ముకొని లబ్ధిపొందాలని ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ భావించిందన్నారు. ట్రై పార్టీ ఒప్పందాన్ని బై పార్టీ అగ్రిమెంట్‌గా మార్చేసి అవినీతికి తెరలేపారన్నారు. రేస్‌కు సంబంధించి రూ.110 కోట్లు చెల్లించి అనుమతులు ఇప్పించాలని నిబంధన పెట్టుకున్నారని, ఇందులో ఎన్నికల కోడ్ సమయంలో నిబంధనలకు విరుద్దంగా రూ.55 కోట్లు చెల్లించారని, ఇంకా రూ.55 కోట్లు చెల్లించాలని నోటీసు వచ్చిందన్నారు. బిజినెస్ రూల్సు భిన్నంగా గత ప్రభుత్వం తప్పిదం చేసిందని, రాష్ట్ర వనరులను తాకట్టు పెట్టిందన్నారు.


ట్రాక్ కోసం రూ.20కోట్లు ఖర్చు పెట్టారని, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.35 కోట్లు ఖర్చు పెట్టిందని, రేస్ సందర్భంగా వారం పది రోజులు రోడ్డు బ్లాక్ చేశారని, ఏజెన్సీ కంపెనీ మాత్రం టికెట్లు అమ్ముకొని వెళ్లిపోయిందన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఉండదని, రేస్ రోడ్ల కోసం ప్రజాధనం వృధా చేసిందన్నారు. సచివాలయం రూల్స్ ప్రకారం చేశారంటే అది లేదని, ఈరేస్‌కు కేబినెట్ అనుమతి లేదని, 55 కోట్లు 3 వ ఈ-రేస్ కోసం డబ్బులు కట్టాలని నోటీస్ పంపారన్నారు. ఈ రేస్ వాళ్ళు వచ్చి హైదరాబాద్ చూసి వెళ్తారంటని, వాళ్ల కోరికలు తీర్చు కోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు.


అరవింద్‌కుమార్‌కు షోకాజ్ నోటీస్‌


సీనీయర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌కు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్(మోమో) నోటీస్‌లు జారీ చేసింది. ఫార్ములా ఈ- రేసింగ్ నిర్వహణకు సంబంధించి గతంలో చేసుకున్న ఒప్పందంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ అనుమతి లేఉండా ఈ రేస్ ఒప్పందం ఎందుకు చేసుకున్నారో తెలుపాలని, ఎన్నికల కోడ్‌లో అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌ఎండీఏ నుంచి ఈ పార్ములా రేస్‌కు 55కోట్లు ఎందుకు చెల్లించారో తెలిపాలని, వారం రోజుల్లో వాటిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.