Devarakonda | భట్టి పాదయాత్రలో కాంగ్రెస్ వర్గాల బాహాబాహి.. జెండా కర్రలతో కొట్టుకున్న నేతలు

Devarakonda | విధాత: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న భట్టి పాదయాత్రలో కాంగ్రెస్ వర్గ పోరు బాహా బాహికి దారి తీసింది. చందంపేట మండలం పోలేపల్లి గ్రామం వద్ద దేవరకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎన్. బాలు నాయక్, ఆయన వర్గీయులు ఒకవైపు, కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న రవి నాయక్, కిషన్ నాయక్ లు మరోవైపు తమ అనుచరులతో కలిసి భట్టికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారి మధ్య నెలకున్న ఆధిపత్య పోరు, గ్రూప్ […]

  • By: krs    latest    Jun 09, 2023 3:16 PM IST
Devarakonda | భట్టి పాదయాత్రలో కాంగ్రెస్ వర్గాల బాహాబాహి.. జెండా కర్రలతో కొట్టుకున్న నేతలు

Devarakonda |

విధాత: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న భట్టి పాదయాత్రలో కాంగ్రెస్ వర్గ పోరు బాహా బాహికి దారి తీసింది.

చందంపేట మండలం పోలేపల్లి గ్రామం వద్ద దేవరకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎన్. బాలు నాయక్, ఆయన వర్గీయులు ఒకవైపు, కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న రవి నాయక్, కిషన్ నాయక్ లు మరోవైపు తమ అనుచరులతో కలిసి భట్టికి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారి మధ్య నెలకున్న ఆధిపత్య పోరు, గ్రూప్ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల కార్యకర్తల మధ్య తోపులాట నెలకొంది. పరస్పరం బాహాబాహీకి దిగడంతో పాటు పార్టీ జెండా కర్రలతో కొట్టుకున్నారు.

ఈ పరిణామాల పట్ల భట్టి అసహనం వ్యక్తం చేసి రెండు వర్గాలను మందలించడంతో వారు వెనక్కి తగ్గడంతో గొడవ సద్దుమణిగింది . అనంతరం భట్టి పాదయాత్రంగా ముందుకు సాగింది.