Devendra Fadavis | ఉప ముఖ్యమంత్రి నుదుటిన కాలు.. కళ్ళు చెమర్చిన ఫడ్నవిస్
కాలి బొటన వేలితో బొట్టు పెట్టిన యువతి విధాత: రాజకీయ నాయకులూ అయినా మామూలు మనుషులే… వాళ్ళలోనూ మన అందరి మాదిరిగానే భావోద్వేగాలు ఉంటాయి.. సందర్భాన్ని బట్టి కళ్ళు చెమరుస్తాయ్. అలాంటి సన్నివేశమే ఒకటి మహారాష్ట్రలో జరిగిబడి. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadavis) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలోని జలగావ్ ప్రాంతంలో ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం దీపస్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఓ యువతి తిలకం […]

- కాలి బొటన వేలితో బొట్టు పెట్టిన యువతి
విధాత: రాజకీయ నాయకులూ అయినా మామూలు మనుషులే… వాళ్ళలోనూ మన అందరి మాదిరిగానే భావోద్వేగాలు ఉంటాయి.. సందర్భాన్ని బట్టి కళ్ళు చెమరుస్తాయ్. అలాంటి సన్నివేశమే ఒకటి మహారాష్ట్రలో జరిగిబడి. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadavis) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
రాష్ట్రంలోని జలగావ్ ప్రాంతంలో ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం దీపస్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఓ యువతి తిలకం దిద్దారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న సన్నివేశంతో ఆయన కళ్లు చెమర్చాయి.
ఇప్పటి వరకు ఎందరో తల్లులు, సోదరీమణుల నుంచి నేను ఆశీర్వాదం తీసుకున్నారు. తిలకం స్వీకరించాను. ఇప్పుడు కూడా నాకు తిలకం దిద్దేందుకు ఓ సోదరి బొటనివేలు నా నుదిటి మీదకు చేరింది. అయితే, అది చేతి వేలు కాదు.. కాలి బొటనవేలు.
आजवर कितीतरी माता-भगिनींनी मला ओवाळलं. कपाळावर आशीर्वादाचा गंध लावला. आजही त्याच भावनेनं अंगठा कपाळाला टेकला पण तो पायाचा… हाताचा नव्हे. आयुष्यात असे हे क्षण येतात आणि आतून-बाहेरून मन थरारतं. अंगावर रोमांच उभे राहतात. डोळ्यांच्या कडा ओलावतात पण क्षणभरच. कारण पायाच्या अंगठ्यानं… pic.twitter.com/WF1X3ab7wA
— Devendra Fadnavis (@Dev_Fadnavis) June 27, 2023
జీవితంలో ఎదురయ్యే ఇలాంటి క్షణాలు ఒక్కసారిగా ఉద్వేగానికి గురిచేస్తాయి. కళ్లు చెమర్చేలా చేస్తాయి. ఈ సోదరి నాకు తిలకం దిద్ది,అదే వేళ్లతో హారతి ఇచ్చింది. అప్పుడు ఆమె మొహంలో చిరునవ్వు,కళ్లల్లో ఒకరకమైన మెరుపు కనిపించింది. నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే. నాకు ఎవరి జాలి,దయ అవసరం లేదు.