యాదగిరిగుట్టలో.. 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు
విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 16 నుంచి జనవరి 15 వరకు 30 రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్. గీతా తెలిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 4:30 గంటల నుంచి 5:15 గంటల వరకు శ్రీ స్వామి వారి ఆలయ ముఖమండపం పైన ఉత్తర భాగాన ఉన్న హాల్ నందు అమ్మవారిని వేయించేపు చేసి తిరుప్పావై కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. […]

విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 16 నుంచి జనవరి 15 వరకు 30 రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్. గీతా తెలిపారు.
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 4:30 గంటల నుంచి 5:15 గంటల వరకు శ్రీ స్వామి వారి ఆలయ ముఖమండపం పైన ఉత్తర భాగాన ఉన్న హాల్ నందు అమ్మవారిని వేయించేపు చేసి తిరుప్పావై కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ధనుర్మాస ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం గోదా కళ్యాణాన్ని జనవరి 14 రాత్రి 7:00 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే జనవరి 15 ఉదయం 11:30 గంటలకు ఒడి బియ్యం కార్యక్రమం నిర్వహించ బడుతుందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.