మునుగోడు ఎన్నికతో నియంత పాలన పతనం: ఈటెల
విధాత: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుతో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడుదామని మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఎల్బీనగర్, పెద్ద అంబర్ పేట పరిధిలోని నియోజకవర్గ ఓటర్లతో ఓటర్లతో తారా కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కి నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ను ఓడించడం బీజేపీకే సాధ్యమన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో […]

విధాత: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుతో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడుదామని మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఎల్బీనగర్, పెద్ద అంబర్ పేట పరిధిలోని నియోజకవర్గ ఓటర్లతో ఓటర్లతో తారా కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ..
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కి నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ను ఓడించడం బీజేపీకే సాధ్యమన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మంచిమార్పుకు మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు బీజేపీని గెలిపించాలన్నారు. బీజేపీ గెలుపుతోనే కేసీఆర్ కుటుంబం కబంధ హస్తాల్లో బంధీ అయిన తెలంగాణ విముక్తి జరుగుతుందన్నారు.
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో బీజేపీ విజయ సాధనకు అంతా సహకరించాలని కోరారు. బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు, ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్య హక్కులు లేకుండా రాష్ట్రం కేసీఆర్ నియంత పాలనలో వేల కోట్ల దోపిడీకి గురై అప్పుల కుప్పగా మారిపోయిందన్నారు. తన రాజీనామాతో మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని, నా రాజీనామా వృధా కాలేదన్నారు.
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు నన్ను ఎన్నో ఆశలతో గెలిపించారని, అయితే సీఎం కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎన్నికైన తన పట్ల చిన్నచూపు చూసి, ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ, నియోజక వర్గంకు నిధులు ఇవ్వకుండా, నేరుగా కలిసి చెప్పేందుకు అపాయింట్మెంట్ ఇవ్వక, అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా వేధింపులకు గురి చేశారన్నారు. అందుకే కేసీఆర్ కుటుంబ పాలన వ్యతిరేకంగా మునుగోడు ఉప ఎన్నిక వేదికగా ధర్మ యుద్ధానికి సిద్ధపడ్డానన్నారు ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో బిజెపిని గెలిపించి చరిత్రలో నిలవాలన్నారు.