నేటి నుంచి డిజిటల్ రూపీ చెలామణి
లాంచ్ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా DIGITAL RUPEE | భారత్‌లో డిజిటల్ రూపీ చెలామణిలోకి వచ్చింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం డిజిటల్ రూపీని లాంచ్ చేసింది. డిజిటల్ రూపీ భారత దేశ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఆర్‌బీఐ చెపుతుంది. డిజిటల్ రూపీ లావాదేవీలు గురువారం నుంచి ఎనిమిది బ్యాంకుల్లో ప్రారంభమం అయినట్లు తెలిపింది. డిజిటల్ రూపీ ఆర్‌బీఐ అధీకృత కరెన్సీ అని తెలిపింది. డిజిటల్ రూపీ […]

లాంచ్ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
DIGITAL RUPEE | భారత్‌లో డిజిటల్ రూపీ చెలామణిలోకి వచ్చింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం డిజిటల్ రూపీని లాంచ్ చేసింది. డిజిటల్ రూపీ భారత దేశ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఆర్‌బీఐ చెపుతుంది. డిజిటల్ రూపీ లావాదేవీలు గురువారం నుంచి ఎనిమిది బ్యాంకుల్లో ప్రారంభమం అయినట్లు తెలిపింది. డిజిటల్ రూపీ ఆర్‌బీఐ అధీకృత కరెన్సీ అని తెలిపింది. డిజిటల్ రూపీ టోకెన్ రూపంలో బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తారని, ఇది చట్ట బద్దంగా చెల్లు బాటు అవుతుందని ఆర్‌బీఐ తెలిపింది.
మొదటి దశలో..
మొదటి దశలో దేశవ్యాప్తంగా నాలుగు నగరాలు ముంబాయి, న్యూ ఢిల్లీ, బెంగుళూరు, భువనేశ్వర్‌లలో డిజిటల్ రూపీ లావాదేవీలు నడుస్తాయని ఆర్‌బీఐ తెలిపింది. ఆతరువాత అహ్మదాబాద్, గ్యాంగ్ టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, సిమ్లా నగరాలకు విస్తరించనున్నది.
ఎనిమిది బ్యాంకులివే..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లతో బ్యాంకులతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లలో పైలట్ ప్రాజెక్ట్ కింద కార్యకలాపాలు జరుగనున్నాయి.