Dimple Hayathi | ‘వల్గర్’.. అంటూ హీరోయిన్‌ని ఇబ్బంది పెట్టాలని అడ్డంగా బుక్కైన రిపోర్టర్

Dimple Hayathi డింపుల్ హయాతి(Dimple Hayathi).. తెలుగమ్మాయ్. అయినా కూడా అందాల ప్రదర్శనలో ఎక్కడా తగ్గదు. గ్లామర్ ప్రదర్శనలో ఫారిన్ నుంచి తెచ్చుకున్న అమ్మాయిలకు సైతం పోటీ ఇవ్వగలదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలబడేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తుందీ అమ్మడు. అయితే తెలుగమ్మాయి అనే కనికరం లేకుండా ఓ రిపోర్టర్ ఆమెని ఇబ్బంది పెట్టాలని చూసి.. అతనే అడ్డంగా బుక్కయ్యాడు. అదెలా అంటే.. తాజాగా డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘రామబాణం’. గోపీచంద్ […]

  • By: krs    latest    Apr 28, 2023 1:23 AM IST
Dimple Hayathi | ‘వల్గర్’.. అంటూ హీరోయిన్‌ని ఇబ్బంది పెట్టాలని అడ్డంగా బుక్కైన రిపోర్టర్

Dimple Hayathi

డింపుల్ హయాతి(Dimple Hayathi).. తెలుగమ్మాయ్. అయినా కూడా అందాల ప్రదర్శనలో ఎక్కడా తగ్గదు. గ్లామర్ ప్రదర్శనలో ఫారిన్ నుంచి తెచ్చుకున్న అమ్మాయిలకు సైతం పోటీ ఇవ్వగలదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలబడేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తుందీ అమ్మడు. అయితే తెలుగమ్మాయి అనే కనికరం లేకుండా ఓ రిపోర్టర్ ఆమెని ఇబ్బంది పెట్టాలని చూసి.. అతనే అడ్డంగా బుక్కయ్యాడు. అదెలా అంటే..

తాజాగా డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘రామబాణం’. గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో ఇది హ్యాట్రిక్ చిత్రం. గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మే 5న విడుదల కాబోతోన్న సందర్భంగా.. చిత్రయూనిట్ తాజాగా మీడియా సమావేశాన్ని నిర్వహించింది.

ఈ సమావేశంలో ఎప్పుడూ తల తిక్క ప్రశ్నలు వేసి బుక్కయ్యే రిపోర్టర్.. ఈసారి కూడా హీరోయిన్‌ని తలతిక్క ప్రశ్న వేశాడు. ‘ఈ సినిమాలో మీ సీన్స్ వల్గర్‌గా అనిపిస్తున్నాయి. సినిమా ఫ్యామిలీ టైప్ అని అనిపిస్తున్నా.. మీ పాత్ర మాత్రం రొమాంటిక్‌గా, వల్గర్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. మీ పాత్రపై మీరేమంటారు?’ అని రిపోర్టర్ ప్రశ్నించాడు.

వాస్తవానికి ‘రామబాణం’ ప్రమోషన్స్‌కి సంబంధించి విడుదల చేసిన డింపుల్ హయాతి పోస్టర్స్‌గానీ, టీజర్.. ట్రైలర్ అన్నింటిలోనూ ఆమె నిండైన దుస్తులలో కనిపించారు. ఎక్కడా అసభ్యకరంగా కనిపించలేదు. అలాంటిది ‘వల్గర్’ అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు డింపుల్ షాకైంది.

మీరేం అడుగుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు అంటూ ఆమె నవ్వుతూనే సమాధానమిచ్చింది. రిపోర్టర్ అలాంటి ప్రశ్న అడిగినా కూడా ఆమె కూల్‌గానే సమాధానమిచ్చింది తప్ప.. సీరియస్ కాలేదు. అయితే ఇక్కడే ఈ రిపోర్టర్ పరువు పోయింది.

ఎలా అంటే.. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర ‘వ్లాగర్’. అంటే.. టిక్‌టాక్ వీడియోలు, ఇంకా ఇతరత్రా వీడియోలు చేసే వారిని వ్లాగర్ అని పిలుస్తారు. అలాంటి పాత్ర డింపుల్ ఇందులో చేస్తుంది.

ఈ ‘వ్లాగర్’కి అర్థం తెలియక రిపోర్టర్ ‘వల్గర్’ అంటూ అడిగి అడ్డంగా బుక్కయ్యాడు. హీరోయిన్‌ని రిపోర్టర్ ఈ ప్రశ్న అడుగుతున్న వీడియో చూసిన వారంతా.. నువ్వేం జర్నలిస్ట్ వయ్యా? అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.