Yuvraj Singh: యువ‌రాజ్ సింగ్ త‌ల్లికి బెదిరింపులు.. రూ.40 ల‌క్ష‌లు ఇవ్వాలంటూ డిమాండ్

Yuvraj Singh: భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆల్‌రౌండ‌ర్‌గా ఆయ‌న భార‌త్‌కి చిరస్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించారు. ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్స్ కొట్టిన ఘ‌న‌త యువ‌రాజ్ సింగ్‌ది. ఆయ‌న క్యాన్స‌ర్‌తో కూడా పోరాడి గెలిచారు. అయితే తాజాగా యువ‌రాజ్ సింగ్ తల్లిని ఓ యువ‌తి బెదిరించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. యువరాజ్ సింగ్ తల్లి షబానన్ సింగ్‌ను తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ ఓ యువ‌తి బెదిరించి రూ.40 లక్షలు దోపిడీకి […]

  • By: sn    latest    Jul 26, 2023 5:41 AM IST
Yuvraj Singh: యువ‌రాజ్ సింగ్ త‌ల్లికి బెదిరింపులు.. రూ.40 ల‌క్ష‌లు ఇవ్వాలంటూ డిమాండ్

Yuvraj Singh:

భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆల్‌రౌండ‌ర్‌గా ఆయ‌న భార‌త్‌కి చిరస్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించారు. ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్స్ కొట్టిన ఘ‌న‌త యువ‌రాజ్ సింగ్‌ది. ఆయ‌న క్యాన్స‌ర్‌తో కూడా పోరాడి గెలిచారు.

అయితే తాజాగా యువ‌రాజ్ సింగ్ తల్లిని ఓ యువ‌తి బెదిరించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. యువరాజ్ సింగ్ తల్లి షబానన్ సింగ్‌ను తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ ఓ యువ‌తి బెదిరించి రూ.40 లక్షలు దోపిడీకి ప్రయత్నించింది. ఆమెని తాజాగా ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

యువరాజ్ సింగ్ సోదరుడు జోరవీర్ సింగ్ కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ క్ర‌మంలో యువీ తల్లి షబ్నం సింగ్ 2022లో హేమా కౌశిక్ అనే మహిళను జోరవీర్‌కు కేర్ టేకర్‌గా నియమించింది.

అయితే, ఆమె ప్ర‌వ‌ర్త‌న‌ నచ్చకపోవడంతో ఉద్యోగంలో నియమించిన కొన్ని రోజులకే ఆమె తొలగించేసింది. ఇది మ‌న‌సులో పెట్టుకున్న మ‌హిళ‌.. ఈ ఏడాది మే నుంచి యువీ తల్లికి వాట్సాప్ ద్వారా బ్లాక్ మెయిల్​ చేస్తూ ఇబ్బందులు పెట్టింది. తనకు రూ.40 లక్షలు ఇవ్వాలని లేకపోతే తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ, కుటుంబ పరువును దెబ్బతీస్తానంటూ దారుణంగా టార్చ‌ర్ పెట్టింది.

హేమకౌశిక్ త‌న‌ని తప్పుడు కేసులో ఇరికిస్తుందేమోనని భయపడిన యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్.. రూ.40 లక్షలు ఇచ్చేందుకు కూడా ఒప్పుకుంది. మొదటి విడతగా రూ.5 లక్షలు ఇస్తానని చెప్పుకుంటూ రాగా, మంగళవారం రూ.5 లక్షలు వసూలు చేసేందుకు వచ్చిన హేమ కౌశిక్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, యువీ ఫ్యామిలీ ఫిర్యాదుతో పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్ మాట్లాడుతూ.. నా కొడుకు బాగోగులు చూసేందుకు హేమ కౌశిక్‌ని నియ‌మించ‌గా, ఆమె నా కొడుకుని తన వలలో వేసుకోవడానికి ప్రయత్నించ‌డంతో తొల‌గించాల్సి వచ్చింద‌ని స్ప‌ష్టం చేసింది.