యాసంగి పంటకు డిండి ప్రాజెక్టు నీటి విడుదల: ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
విధాత: యాసంగి పంటకు డిండి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు దేవరకొండ శాసన సభ్యుడు, టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. డిండీలో శనివారం ఆయన మాట్లాడుతూ డిండీ ప్రాజెక్టు కింద ఆరు తడి పంటలకు నీరు ఇస్తామని చెప్పారు. రైతులు యాసంగి పంటల సాగుకు సమాయత్తం కావాలని ఆయన కోరారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీతజనార్దన్ రావు, మార్కెట్ చైర్మన్ […]

విధాత: యాసంగి పంటకు డిండి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు దేవరకొండ శాసన సభ్యుడు, టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. డిండీలో శనివారం ఆయన మాట్లాడుతూ డిండీ ప్రాజెక్టు కింద ఆరు తడి పంటలకు నీరు ఇస్తామని చెప్పారు.
రైతులు యాసంగి పంటల సాగుకు సమాయత్తం కావాలని ఆయన కోరారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీతజనార్దన్ రావు, మార్కెట్ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, రైతు బంధు అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్ రావు, శిరందాసు కృష్ణయ్య, ఏసీఎస్ చైర్మన్లు నాగార్జున్ రెడ్డి, మాధవరం శ్రీనివాసరావు, సర్పంచ్ మేకల సాయమ్మకాశయ్య, వైస్ ఎంపీపీ పుల్లమ్మ, మాజీ ఎంపీపీ వెంకట్రామ్, రాఘవ చారి, మాల్ రెడ్డి విష్ణువర్దన్ రెడ్డి, ఎంపీటీసీ వెంకటయ్య, గెలమోని శ్రీను, బొడ్డుపల్లి కృష్ణ, బొడ్డుపల్లి జయంత్, సురేష్, సంజీవ పాల్గొన్నారు.