సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సినీ నిర్మాత, దర్శకులు అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డిలు
సినీ నిర్మాత అచ్చిరెడ్డి, సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డిలు శనివారం మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

విధాత, హైదరాబాద్ : సినీ నిర్మాత అచ్చిరెడ్డి, సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డిలు శనివారం మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా తాము సీఎం రేవంత్‌రెడ్డిని తొలిసారిగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందిన అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలుగు సిని పరిశ్రమకు మరింత సహాయ, సహకారాలు అందించనుందన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.