BRSకు MIMల మధ్య దూరం.. ఏమిటా కథ?
రాష్ట్రంలో పార్టీ విస్తరణలో ఎంఐఎం అక్బరుద్ధీన్‌తో కాంగ్రెస్ నేతల భేటీ ఈ పరిణామాలపై రాజకీయవర్గాల్లో చర్చ విధాత: బీఆర్‌ఎస్‌కు ఎంఐఎంకు మధ్య దూరం పెరిగిందా? ఇప్పటివరకు అధికారపార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓట్లకు గంటి కొట్టబోతున్నదా? ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు, నాందేడ్ సభకు ఎంఐఎం దూరంగా ఉన్నది. బీజేపీకి ఎంఐఎం బీటీమ్ అనేది ప్రచారంలో ఉన్నది. బీఆర్‌ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణ చేస్తున్నది. ఈ […]

- రాష్ట్రంలో పార్టీ విస్తరణలో ఎంఐఎం
- అక్బరుద్ధీన్‌తో కాంగ్రెస్ నేతల భేటీ
- ఈ పరిణామాలపై రాజకీయవర్గాల్లో చర్చ
విధాత: బీఆర్‌ఎస్‌కు ఎంఐఎంకు మధ్య దూరం పెరిగిందా? ఇప్పటివరకు అధికారపార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓట్లకు గంటి కొట్టబోతున్నదా? ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు, నాందేడ్ సభకు ఎంఐఎం దూరంగా ఉన్నది. బీజేపీకి ఎంఐఎం బీటీమ్ అనేది ప్రచారంలో ఉన్నది. బీఆర్‌ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణ చేస్తున్నది. ఈ సమయంలో ఎంఐఎం ను కలుపుకుని వెళ్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచన బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఆ పార్టీని దూరం పెట్టి ఉండొచ్చు అంటున్నారు.
దీంతో పతంగ్, కారు పార్టీల మధ్య పోరు మొదలైందా అన్న చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే వీటికి బలం చేకూర్చేలా బడ్జెట్ సమావేశాల సందర్భంగా అక్బరుద్దీన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చసమయంలో మంత్రి కేటీఆర్‌కు, అక్బరుద్దీన్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొంతు చించుకుని మాట్లాడితే ప్రయోజనం ఉండదని చురకలు అంటించారు.
సోమవారం బడ్జెట్ సమావేవం ముగిసిన అనంతరం అసెంబ్లీ లాబీలో ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డిలు సమావేశం కావడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పటు వివిధ అంశాలపై సుమారు గంట పాటు చర్చించారట. బీజేపీకి ఎంఐఎం బీటీమ్ అని ప్రచారం చేస్తున్నారు.
కానీ మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకువెళ్తున్నాం, దేశంలో, రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఆ పార్టీ పర్తిగా ఓటు బ్యాంకును పోలరైజ్ చేస్తున్నది. మేము మా వర్గానికి అండగా ఉంటామని అక్బరుద్దీన్ కాంగ్రెస్ నేతలతో అన్నట్టు తెలుస్తోంది.
మీరు మీ వర్గానికి అండగా ఉంటూ ఆ ఓట్లు చీల్చాలనే బీజేపీ అజెండా కదా అని శ్రీధర్‌బాబు అడిగితే.. ఎవరు ఏమనుకున్నా.. వచ్చే ఎన్నికల్లో మేము రాష్ట్రంలో మా పార్టీని మరింత విస్తరిస్తామని అన్నట్టు విశ్వసనీయ సమాచారం.
సభలో సభా నాయకుడు లేడని, సమావేశాలు తక్కువ రోజులు జరుగుతున్నాయని, నోట్ల రద్దును మేము వ్యతిరేకిస్తే మీరు మద్దతు ఇచ్చారు. బీజేపీకి మేము బీ టీమ్ అని కొందరు అంటున్నారని, మీరు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు.
ఇప్పుడు ఎవరు ఎవరికి బీ టీమ్ అవుతారో తెలియదు అన్నారు. అధికారపక్షానికి సహనం తగ్గిపోతున్నది. కేటీఆర్ వయసులో తనకంటే చిన్నవాడు, అందుకే ఆవేశం ఎక్కువ అని బాగా చదువుకున్నవాడు ఆలోచించి మాట్లాడాలనిఅక్బర్ హితవు పలికారు.
దీనికి మంత్రి కేటీఆర్ గట్టిగానే బదులు ఇచ్చారు. అయితే తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఎంఐఎం బీఆర్‌ఎస్ పార్టీతో వ్యవహరిస్తున్న తీరు పట్ల రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 0.49 శాతం ఓట్లు సాధించింది.
దీంతో ఆ పార్టీ వల్లే కొన్ని నియోజకవర్గాల్లో సమాజ్‌వాదీ పార్టీ స్వల్ప మెజారిటీతో ఓడిపోయిందిని ఆపార్టీ నేతలు ఆరోపించారు. మహారాష్ట్రంలోనూ గత ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసి 2 సీట్లు సాధించింది 7,37888 లక్షల ఓట్లు సంపాదించింది. అక్కడ ఆపార్టీకి 1.34 శాతం ఓట్లు వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రంలోనూ గత ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేసి 7 స్థానాలు గెలిచిది. ఇక్కడ ఆ పార్టీకి 2.7 శాతం ఓట్లు వచ్చాయి ఎన్నికల్లో ఒక్క ఓటు గెలిచినా గెలుపే. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఓట్ల శాతం స్వల్పమే ప్రధాని కూడా చెప్పిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న సమయంలో రాష్ట్రంలో ఎంఐఎస్ మరింత విస్తరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.