మెదక్: అనాథలకు దుప్పట్ల పంపిణీ

విధాత, మెదక్ బ్యూరో: స్వచ్ఛంద సంస్థ బైతుల్ మాల్ కమిటీ మెదక్ ఆధ్వర్యంలో అనాథ వృద్దులకు దుప్పట్ల పంపిణీ చేశారు. మూడు రోజులుగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు, తీవ్ర చలి కారణంగా రోడ్డుపై నిద్రిస్తున్న అనాథలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మాతా శిశు ఆసుపత్రిలో తీవ్ర చలిలో బయట నిద్రిస్తున్న పేషంట్ల బంధువులకు కూడా దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆబిత్ అలీ శుత్తారి, గఫార్ అహ్మద్, మొహమ్మద్ రియాజ్ ఉద్దీన్, జర్నలిస్ట్ షఫీ హుద్దీన్ , […]

  • By: krs    latest    Jan 13, 2023 3:23 PM IST
మెదక్: అనాథలకు దుప్పట్ల పంపిణీ

విధాత, మెదక్ బ్యూరో: స్వచ్ఛంద సంస్థ బైతుల్ మాల్ కమిటీ మెదక్ ఆధ్వర్యంలో అనాథ వృద్దులకు దుప్పట్ల పంపిణీ చేశారు. మూడు రోజులుగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు, తీవ్ర చలి కారణంగా రోడ్డుపై నిద్రిస్తున్న అనాథలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.

మాతా శిశు ఆసుపత్రిలో తీవ్ర చలిలో బయట నిద్రిస్తున్న పేషంట్ల బంధువులకు కూడా దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆబిత్ అలీ శుత్తారి, గఫార్ అహ్మద్, మొహమ్మద్ రియాజ్ ఉద్దీన్, జర్నలిస్ట్ షఫీ హుద్దీన్ , మహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహమ్మద్ రఫీ ఖాన్ పాల్గొన్నారు.