రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనాంజా.. 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం..
విధాత, ఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. దీపావళి కానుకగా బోనస్ ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వే ఉద్యోగులకు 78 రోజులకు సమానమైన బోనస్ చెల్లింపునకు మోదీ క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కాగా, గత ఏడాది కాలంలో ఇండియన్ రైల్వేస్ భారీ ఆదాయాన్ని రాబట్టింది. ఈ క్రమంలోనే ఆర్జించిన లాభాల ఆధారంగా.. అందులోని కొంత భాగాన్ని ఉద్యోగులకు […]

విధాత, ఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. దీపావళి కానుకగా బోనస్ ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వే ఉద్యోగులకు 78 రోజులకు సమానమైన బోనస్ చెల్లింపునకు మోదీ క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
కాగా, గత ఏడాది కాలంలో ఇండియన్ రైల్వేస్ భారీ ఆదాయాన్ని రాబట్టింది. ఈ క్రమంలోనే ఆర్జించిన లాభాల ఆధారంగా.. అందులోని కొంత భాగాన్ని ఉద్యోగులకు బోనస్‌గా ఇవ్వనుంది. దాదాపు 11.27 లక్షల మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు ఈ బోనస్ అందనుంది.
‘ఈ బోనస్ చెల్లింపు ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఉపయోగపడుతుంది. రైల్వేస్ మళ్లీ ఆదాయాల బాట పట్టడంలోనే కాకుండా.. రైల్వే ప్రయాణీకుల భద్రత, మెరుగైన సేవలను అందించడంలో సహాయపడిన వారందరిలోనూ ఈ బోనస్ చెల్లింపు కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని కేంద్రం తెలిపింది.
బోనస్ విషయంలో కేంద్రం ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చింది. ఇది ప్రొడెక్టివిటీ లింక్‌డ్ బోనస్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మొత్తం 11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్ఠంగా రూ.17,951 పొందుతారని వివరించారు.
ట్రాక్ మెయింటెయినర్లు, డ్రైవర్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, కంట్రోలర్లు, పాయింట్‌మెన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ ‘సి’ సిబ్బందితో సహా వివిధ వర్గాలకు పైన పేర్కొన్న బోనస్‌ను చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.