టొరంటో: ‘బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్’ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన దీపావళి సంబురాలు
విధాత: కెనడాలోని టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. 120 మంది వలంటీర్లతో ,170 స్టేజ్ పర్ఫామెన్స్ లతో 1500 మంది అతిథుల సమకంలో దీపావళి పండుగను ఘనంగా జరిపారు. వేడుకకు విచ్చేసిన అతిథులందరికీ 14 రకాల ఐటమ్స్ తో అచ్చ తెలుగు విందు భోజనాలు వడ్డించారు. అనంతరం ఏడు గంటల పాటు శాస్త్రీయ నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా పాటలు, డాన్స్ లు ఆహుతులను కనువిందు […]

విధాత: కెనడాలోని టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. 120 మంది వలంటీర్లతో ,170 స్టేజ్ పర్ఫామెన్స్ లతో 1500 మంది అతిథుల సమకంలో దీపావళి పండుగను ఘనంగా జరిపారు.
వేడుకకు విచ్చేసిన అతిథులందరికీ 14 రకాల ఐటమ్స్ తో అచ్చ తెలుగు విందు భోజనాలు వడ్డించారు. అనంతరం ఏడు గంటల పాటు శాస్త్రీయ నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా పాటలు, డాన్స్ లు ఆహుతులను కనువిందు చేశాయి. చివరగా పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చారు.
ఈ వేడుకలకు టొరంటో సిటీ కౌన్సెలర్ గేరి క్రాఫోర్డ్ మరియు సతీమణి ముఖ్య అతిథులుగా హాజరై మెంబర్స్ కి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియా కెనడాల మధ్య బంధం మరింత ధ్రుడం కావాలని ఆకాంక్షించారు.
ఆర్గనైజర్ జగపతి రాయల మాట్లాడుతూ కెనడా చరిత్రలో ఇది అతిపెద్ద దీపావళి ఈవెంట్ అని ఇలాంటి మరిన్ని భారతీయ పండుగలను ఘనంగా నిర్వహించి సంస్కృతి సంప్రదాయాలను కాపాడతామని తెలిపారు.
అదేవిధంగా మరో ఆర్గనైజర్ సూర్య కొండేటి మాట్లాడుతూ 120 మంది వలంటీర్లు రాత్రి ప్రగలు శ్రమించి దీపావళి ఈవెంట్ ను ఇంత గొప్పగా విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?.. ఒక్క రూపాయ్ ఇవ్వను: పూరీ ఫైర్!
దీన్ దయాల్ రెడ్డి ముత్తుకూరు, రామ్ జిన్నల, శ్రీకాంత్ లింగమనేని, ఫణీంద్ర కుమార్ కొడాలి, భరత్ కుమార్ రెడ్డి, మినర్వా రెస్టారెంట్, హార్టుఫుల్ రిలాక్సేషన్ సౌజన్యంతో ఈ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ ఈవెంట్ నిర్వహించిన బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ కార్యనిర్వాహక సభ్యులు
రూ.లక్ష, బంగారం, కిలో వెండి గిఫ్ట్‌గా ఇచ్చిన టూరిజం మినిస్టర్
జగపతి రాయల, సూర్య కొండేటి, బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్, మిషన్ అఫ్ మదర్ Mission Of Mothers (MOM) ఈ కార్యక్రమ విజయవంతం కావడానికి తమ వంతు సహకరించారు.