DJ టిల్లు.. రూమర్స్‌కు అనుపమ ఫుల్‌స్టాప్‌

విధాత: తెలుగులో ప్రస్తుతం ఉన్న మలయాళ‌ కుట్టి అనుపమ పరమేశ్వరన్ మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవాలి. ఒకవైపు హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు దర్శ‌క‌త్వ శాఖలో శిక్షణ తీసుకొని దర్శకత్వం వైపు అడుగులు వేస్తానని తెలిపింది. తాజాగా ఆమె తన ప్రత్యామ్నాయ వృత్తి అంటూ మరో ప్రొఫెషన్ గురించి సరదాగా స్పందించింది. అదేంటంటే.. పోయిన ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే టిల్లు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా హీరో బాడీ లాంగ్వేజ్ నుంచి ప్రతి ఒక్కటి […]

  • By: krs    latest    Jan 13, 2023 10:28 AM IST
DJ టిల్లు.. రూమర్స్‌కు అనుపమ ఫుల్‌స్టాప్‌

విధాత: తెలుగులో ప్రస్తుతం ఉన్న మలయాళ‌ కుట్టి అనుపమ పరమేశ్వరన్ మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవాలి. ఒకవైపు హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు దర్శ‌క‌త్వ శాఖలో శిక్షణ తీసుకొని దర్శకత్వం వైపు అడుగులు వేస్తానని తెలిపింది. తాజాగా ఆమె తన ప్రత్యామ్నాయ వృత్తి అంటూ మరో ప్రొఫెషన్ గురించి సరదాగా స్పందించింది.

అదేంటంటే.. పోయిన ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే టిల్లు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా హీరో బాడీ లాంగ్వేజ్ నుంచి ప్రతి ఒక్కటి కొత్తద‌నంతో నిండి ఉండడంతో ప్రేక్షకులు ఆ చిత్రానికి మంచి విజ‌యాన్ని క‌ట్ట‌పెట్టారు. దానికి కొనసాగింపుగా ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే మూవీ తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే పలువురు హీరోయిన్స్ తప్పుకున్నారని ప్రచారం సాగింది.

అనుపమ పరమేశ్వరన్ నటిస్తోందని ప్రకటించిన తర్వాత కూడా ఆమె ఈ చిత్రం నుంచి వైదొల‌గింద‌ని వార్తలు వచ్చాయి. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపికైందని.. ఆమె కూడా సినిమా నుంచి బయటకు వచ్చేసిందని, ఆస్థానంలో శ్రీలీల ఎంట్రీ ఇచ్చిందని ఇలా పలు రకాల ఊహాగానాలు మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి.

దీనిపై ఎక్కడా స్పందించని అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన పోస్టుతో ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టింది. ఈ సినిమాలోకి అడుగుపెట్టిన ఆమె సిద్దు జొన్నల‌గడ్డ జుత్తుకు జెల్ క్రీమ్ రాస్తూ కనిపించింది. ఇది నా ప్రత్యామ్నాయ వృత్తి అంటూ దానికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

డీజే టిల్లుకు విమల కృష్ణ దర్శకత్వం వహించగా దాని సీక్వెల్‌ను రామ్ మ‌ల్లిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవ‌ర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తొలి భాగంలో హీరో పాత్ర టిల్లు, హీరోయిన్ పాత్ర రాధిక ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా యూత్‌కు ఈ పాత్రలో బాగా కనెక్ట్ అయ్యాయి. టిల్లు పాత్రను మొదటి భాగంలో కూడా సిద్దు జొన్నలగడ్డ పోషించగా రాధికా పాత్రను నేహా శెట్టి పోషించింది. ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించడంతో ఆడియన్స్‌లో ఆసక్తి మొదలైంది. కానీ అనుకున్న రీతిలో మాత్రం ఈ చిత్రం ముందుకు కదలడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతోన్న వార్త.