ఇన్నేళ్లకు మునుగోడు గుర్తుకు వ‌చ్చిందా కేటీఆర్‌: ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌

విధాత: మునుగోడులో బీజేపీ అభ్య‌ర్థి రాజ‌గోపాల్‌రెడ్డి కాంట్రాక్టుల కోసమే పార్టీ మారార‌ని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు కౌంట‌ర్ ఇచ్చారు. టీఆర్ఎస్‌లో చేర్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు ఏం కాంట్రాక్టులు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. సంస్థాన్ నారాయ‌ణ‌పురంలో ఆయ‌న ఇంటింటి ప్ర‌చారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మునుగోడును ద‌త్త‌త తీసుకుంటానన్న కేటీఆర్‌కు ఇన్నేళ్ల త‌ర్వాత ఈ ప్రాంతం గుర్తుకు వ‌చ్చిందా అని ప్ర‌శ్నించారు. సిరిసిల్ల‌, సిద్దిపేట‌, నారాయ‌ణఖేడ్‌, పాలేరు అయిపోయింది. ఇప్పుడు మ‌నుగోడును […]

  • By: krs    latest    Oct 14, 2022 8:27 AM IST
ఇన్నేళ్లకు మునుగోడు గుర్తుకు వ‌చ్చిందా కేటీఆర్‌: ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌

విధాత: మునుగోడులో బీజేపీ అభ్య‌ర్థి రాజ‌గోపాల్‌రెడ్డి కాంట్రాక్టుల కోసమే పార్టీ మారార‌ని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు కౌంట‌ర్ ఇచ్చారు. టీఆర్ఎస్‌లో చేర్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు ఏం కాంట్రాక్టులు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. సంస్థాన్ నారాయ‌ణ‌పురంలో ఆయ‌న ఇంటింటి ప్ర‌చారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..

మునుగోడును ద‌త్త‌త తీసుకుంటానన్న కేటీఆర్‌కు ఇన్నేళ్ల త‌ర్వాత ఈ ప్రాంతం గుర్తుకు వ‌చ్చిందా అని ప్ర‌శ్నించారు. సిరిసిల్ల‌, సిద్దిపేట‌, నారాయ‌ణఖేడ్‌, పాలేరు అయిపోయింది. ఇప్పుడు మ‌నుగోడును ద‌త్త‌త తీసుకుంటామ‌ని బ‌య‌లుదేరారు. కొత్త జీత‌గాళ్లు పొద్దెరుగ‌రు అన్న‌ట్లు ఏడాదిన్న‌ర కాలం లేదు ఇప్పుడు వ‌చ్చి ద‌త్త‌త తీసుకుంటారా? ఎనిమిదిన్న‌రేండ్ల కొలువులో ఏం చేశావురా అంటే గాడిద పండ్లు తోమిన‌ట్లు ఉన్న‌ది పంచాయితీ అని ఎద్దేవా చేశారు.

ఎందుకు ఇప్పుడు ద‌త్త‌త‌? ఈ ఏడాదిన్నర కాలంలో మీరు చేసేది ఏమిటి? కొత్త‌గా మీరు ఉద్ధ‌రించింది ఏమున్న‌ద‌ని ప్ర‌శ్నించారు. ఎనిమిదిన్న‌రేళ్ల మీ పాల‌న‌లో బంగారు తెలంగాణ అయి ఉంటే ఇవాళ బూతుకొక మంత్రి, ఎమ్మెల్యే ఎందుకు వ‌స్తున్నారో ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌సరం ఉంటుంద‌న్నారు.

మేము మొద‌టి నుంచి ఆరోపిస్తున్నాం పైస‌ల‌న్నీ సిద్దిపేట‌కు లేదా గ‌జ్వేల్‌కు లేదా సిరిసిల్ల‌కు పోతున్నాయనే మాట‌లు నిజ‌మ‌ని మంత్రి కేటీఆర్ అంగీక‌రించినందుకు ఆయ‌న‌కు అభినంద‌న‌లని రఘునందన్‌ రావు ఎద్దేవ ఏశారు. రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన మూడున్న‌ర ఏండ్ల‌కు గానీ మీరు మునుగోడుకు మూడుసార్లు రాలేదు. మీ నాయ‌న అస‌లుకే రాలేదనని అన్నారు. న‌ల్గొండ‌ను ద‌త్త‌త తీసుకుంటామ‌ని చెప్పి నాలుగు రోడ్లు వెడ‌ల్పు చేసి వెళ్లిపోయారు. ఎక్క‌డ ఎన్నిక‌లు వ‌స్తే అక్క‌డ ద‌త్త‌త తీసుకోవ‌డం త‌ప్పా 119 నియోజ‌క‌వ‌ర్గాల‌ను స‌మ దృష్టితో చూడాల‌నే భావ‌న వారికి లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం అన్నారు.