MBA విభాగంలో శ్రీనాథ్‌రెడ్డికి డాక్టరేట్ ప్రదానం
విధాత, అనంతపురం: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఎంబీఏ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో "ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల పనితీరు మూల్యాంకనం" అంశం మీద పరిశోధన చేసిన పూల శ్రీనాథ్ రెడ్డికి డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ మేరకు సోమవారం రోజు వర్సిటీ అధికారులు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని తీరు, వాటి […]

విధాత, అనంతపురం: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఎంబీఏ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో “ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల పనితీరు మూల్యాంకనం” అంశం మీద పరిశోధన చేసిన పూల శ్రీనాథ్ రెడ్డికి డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ మేరకు సోమవారం రోజు వర్సిటీ అధికారులు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని తీరు, వాటి ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు మరియు అందులోని సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు పై తమ పరిశోధన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసినట్టు అయన తెలిపారు.
- ముఖ్యంగా కోవిడ్ సమయంలో వీటి పనితీరు అద్భుతంగా ఉందని, అప్పటి వరకు ఆ ఆరోగ్య కేంద్రాల పై అవగాహన లేని వారు సైతం కోవిడ్ టీకాలు మరియు వైద్యం నిమిత్తం వాటి పై ఆధార పడ్డారు అని, ఇదే సమయంలో ఆయా కేంద్రాల్లో తగినంత మౌలిక సదుపాయాలు లేనందున వాటిని పెంచాల్సిన అవసరం పై ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చామని తెలిపారు.
- పారా మెడికల్ సిబ్బందికి మరిన్ని మౌలిక వసుతులు కల్పిస్తూ వారి నైపుణ్యాలను పెంచుకొనే విధంగా ట్రైనింగ్ ఏర్పాట్లు మరియు వారి సంఖ్య పెంచవలసిన అవసరం ఉందని తమ పరిశోధనలో పేర్కొన్నట్టు వివరించారు.
తన పరిశోధన పూర్తవడానికి సహకరించిన గైడ్ రిటైర్డ్ ఫ్రొఫెసర్ బి కృష్ణారెడ్డి గారికి, వర్సిటీ వీసీ రామకృష్ణారెడ్డి గారికి, ఎంబిఎ విభాగ సిబ్బందికి, వర్సిటీ యంత్రాంగానికి మరియు తన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.