జింక పిల్లపై కుక్కల దాడి.. కాపాడిన గ్రామస్తులు
విధాత, నిజామాబాద్: అటవీ ప్రాంతం నుంచి తప్పించుకొని గ్రామంలోకి ప్రవేశించిన జింక పిల్లను గ్రామస్తులు పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోకి సోమవారం ఉదయం ప్రవేశించిన జింక పిల్లపై కుక్కలు దాడి చేశాయి. స్థానికులు హన్ను, వసరి, రమేష్ కుక్కల బారి నుండి జింక పిల్లను కాపాడారు. అనంతరం వారు అటవీ అధికారులకు సమాచారం అందించగా పిట్లం చేరుకొని జింక పిల్లను స్వాధీనం చేసుకున్నారు. చికిత్స నిమిత్తం జింక పిల్లను పశు […]

విధాత, నిజామాబాద్: అటవీ ప్రాంతం నుంచి తప్పించుకొని గ్రామంలోకి ప్రవేశించిన జింక పిల్లను గ్రామస్తులు పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోకి సోమవారం ఉదయం ప్రవేశించిన జింక పిల్లపై కుక్కలు దాడి చేశాయి.
స్థానికులు హన్ను, వసరి, రమేష్ కుక్కల బారి నుండి జింక పిల్లను కాపాడారు. అనంతరం వారు అటవీ అధికారులకు సమాచారం అందించగా పిట్లం చేరుకొని జింక పిల్లను స్వాధీనం చేసుకున్నారు.
చికిత్స నిమిత్తం జింక పిల్లను పశు వైద్య శాలకు తరలించారు. ఈ సందర్భంగా జింక పిల్లను కాపాడిన హన్ను, వసరి, రమేష్ లను అటవీ అధికారులు అభినందించారు.