అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పోటీ చేస్తా : డొనాల్డ్ ట్రంప్

Donald Trump | అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 2024లో జ‌ర‌గ‌బోయే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పోటీ చేస్తున్న‌ట్లు బుధ‌వారం ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు యూఎస్ ఫెడ‌ర‌ల్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కు ట్రంప్ మ‌ద్ద‌తుదారులు అందుకు సంబంధించిన ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారు. అమెరికా పున‌రాగ‌మ‌నం ఇప్పుడే ప్రారంభ‌మైంద‌ని త‌న మ‌ద్ద‌తుదారులతో ట్రంప్ వ్యాఖ్యానించిన‌ట్లు ఓ న్యూస్ ఏజెన్సీ వెల్ల‌డించింది. యునైటెడ్ స్టేట్స్ అధ్య‌క్షుడిగా త‌న అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టిస్తున్నాన‌ని ట్రంప్ […]

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పోటీ చేస్తా : డొనాల్డ్ ట్రంప్

Donald Trump | అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 2024లో జ‌ర‌గ‌బోయే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పోటీ చేస్తున్న‌ట్లు బుధ‌వారం ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు యూఎస్ ఫెడ‌ర‌ల్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కు ట్రంప్ మ‌ద్ద‌తుదారులు అందుకు సంబంధించిన ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారు. అమెరికా పున‌రాగ‌మ‌నం ఇప్పుడే ప్రారంభ‌మైంద‌ని త‌న మ‌ద్ద‌తుదారులతో ట్రంప్ వ్యాఖ్యానించిన‌ట్లు ఓ న్యూస్ ఏజెన్సీ వెల్ల‌డించింది. యునైటెడ్ స్టేట్స్ అధ్య‌క్షుడిగా త‌న అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టిస్తున్నాన‌ని ట్రంప్ పేర్కొన్నారు.

2016లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు. తర్వాత 2020లో రెండోసారి పోటీ చేసి.. డెమోక్రటిక్ నేత జో బైడెన్ చేతిలో ఓటమిపాలయ్యారు.

ఇటీవ‌ల ఓ మీటింగ్‌కు హాజ‌రైన ట్రంప్‌ను అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా? అని మీడియా ప్ర‌శ్నించింది. ఈ ప్ర‌శ్న‌కు ఆయ‌న బ‌దులిస్తూ త‌ప్ప‌కుండా అని బదులిచ్చారు. అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేండ్ల‌ సమయం ఉంది. అయితే.. ఈలోగా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎలక్షన్‌లో ప్రస్తుత ప్రభుత్వంపై అక్కడి ప్రజల అభిప్రాయమేంటో కచ్చితంగా తెలుస్తుంది. ఇందులోని ఫలితాలు…అధ్యక్ష ఎన్నికలనూ ప్రభావితం చేస్తాయ‌ని ట్రంప్ పేర్కొన్నారు.