Ravi Teja | ‘దొంగ’ బయోపిక్‌.. కొత్త ట్రెండును తెస్తున్న మాస్ మహారాజా!

విధాత‌, సినిమా: దొంగలు, వివాదాస్పద వ్యక్తుల బయోపిక్‌లు జనాల్లో మంచి క్యూరియాసిటీని కలిగిస్తాయి. అందుకే బాలీవుడ్‌లో ఇలాంటి తరహా దొంగల గురించి, వివాదాస్పద వ్యక్తుల గురించి పలు బయోపిక్స్ రూపొంది ఘన విజయం సాధించాయి. ఇప్పుడు అదే ట్రెండ్‌ను తెలుగులోకి తీసుకొని వస్తున్న ఘనత రవితేజ (Ravi Teja)కు దక్కుతుంది. మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు […]

Ravi Teja | ‘దొంగ’ బయోపిక్‌.. కొత్త ట్రెండును తెస్తున్న మాస్ మహారాజా!

విధాత‌, సినిమా: దొంగలు, వివాదాస్పద వ్యక్తుల బయోపిక్‌లు జనాల్లో మంచి క్యూరియాసిటీని కలిగిస్తాయి. అందుకే బాలీవుడ్‌లో ఇలాంటి తరహా దొంగల గురించి, వివాదాస్పద వ్యక్తుల గురించి పలు బయోపిక్స్ రూపొంది ఘన విజయం సాధించాయి. ఇప్పుడు అదే ట్రెండ్‌ను తెలుగులోకి తీసుకొని వస్తున్న ఘనత రవితేజ (Ravi Teja)కు దక్కుతుంది.

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంది. కోస్తా తీరంలో ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు ఒక అప్డేట్ ఇచ్చాడు. ఒక వీడియోను రిలీజ్ చేశాడు.

ఈ వీడియోలో విశాఖ తీరాన షూటింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పడవలు కంటైన‌ర్లు కనిపిస్తున్నాయి. వీడియోకి ఇచ్చే బీజీఎం అదిరిపోతుంది. జీవి ప్రకాష్ (GV Prakash) అందించిన సంగీతం ఆకట్టు కుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫస్ట్ లుక్ ఎప్పుడు అని కామెంట్స్ పెడుతున్నారు.

టైగర్ నాగేశ్వరరావు అనే అతను గజదొంగ. ఇతను స్టూవర్ట్‌పురం (Stuart puram) ప్రాంతానికి చెందిన వాడు. 1970-1980 దశకంలో పోలీసులకు తలనొప్పిగా తయారైన వ్యక్తి. ఉన్న వాడిని దోచుకుని.. లేని వాడికి పెట్టు అనేది ఇతని సిద్ధాంతం. దీంతో దాదాపు ఆయన ఇంటిపేరు స్టూవర్ట్‌పురం అయిపోయింది. అక్క‌డ ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి పాత్రలో రవితేజ నటిస్తున్నాడు.

రవితేజ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం ఇదే. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇదే క‌థాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. డైరెక్టర్ వంశీకృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

అయితే అందరి దృష్టి మాత్రం రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా మీదనే ఉంది. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో రేణుదేశాయ్ (Renu Desai) సామాజిక కార్యకర్తగా న‌టిస్తోంది. హేమలత లవణం అనే సామాజిక కార్యకర్త పాత్ర‌ను పోషిస్తుంది. గాయత్రీ భరద్వాజ్, నూపూర్ సనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.