సందిగ్ధంలో ఫార్ములా ఈ‍‍‍‍‍-కార్‌ రేస్ నిర్వాహణ

గత సంవత్సరం హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంటర్నేషన్ ఈవెంట్‌ ఫార్ములా ఈ-స్ట్రీట్ రేస్ నిర్వాహణపై సందేహాలు ముసురుకున్నాయి.

  • By: Somu    latest    Dec 28, 2023 10:00 AM IST
సందిగ్ధంలో ఫార్ములా ఈ‍‍‍‍‍-కార్‌ రేస్ నిర్వాహణ

విధాత: గత సంవత్సరం హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంటర్నేషన్ ఈవెంట్‌ ఫార్ములా ఈ-స్ట్రీట్ రేస్ నిర్వాహణపై సందేహాలు ముసురుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 10న జరగవలసిన రేస్ రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. అక్టోబర్ 30న ఫార్ములా ఈ-రేస్‌ నిర్వహణకు ఈ-ప్రిక్స్‌ సంస్థతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.


ఈ ఒప్పంద వివరాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆ సంస్థ ప్రతినిధులు చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ-స్ట్రీట్ రేస్ నిర్వాహణపై ఆసక్తిగా లేదని సమాచారం. దీంతో రేస్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. గత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో హైద్రాబాద్ నగర ప్రతిష్ట పెంచే ఆలోచనతో ఇంటర్నేషనల్ ఫార్ములా ఈ-రేస్ నిర్వాహణకు పూనుకుంది