మద్యం మత్తులో తల్లిని చంపబోయి చెల్లెలి చేతిలో హతం

మద్యానికి బానిసై కన్నతల్లినే చంపబోయిన వ్యక్తిని అడ్డుకునే క్రమంలో చెల్లెలు చేతిలో హతమైన సంఘటన సోమవారం రాత్రి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో జరిగింది

మద్యం మత్తులో తల్లిని చంపబోయి చెల్లెలి చేతిలో హతం

విధాత : మద్యానికి బానిసై కన్నతల్లినే చంపబోయిన వ్యక్తిని అడ్డుకునే క్రమంలో చెల్లెలు చేతిలో హతమైన సంఘటన సోమవారం రాత్రి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో జరిగింది. సాగర్ సీఐ బీసన్న తెలిపిన వివరాలు ప్రకారం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ చెందిన సామల్లు రమేష్ (45) వృత్తిరీత్యా లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రమేష్ మద్యానికి బానిసై సోమవారం రాత్రి మద్యం సేవించి తల్లి బాలామణిపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన ఇద్దరు చెల్లెళ్ళు సుశీల , సునీతలను నెట్టివేయడంతో కింద పడ్డారు. అదే సమయంలో తల్లి బాలామణి గొంతుపై రమేష్ కాలు పెట్టి తొక్కుతుండడంతో భయ బ్రాంతులకు గురైన చెల్లెలు సుశీల ఇంట్లో దొరికిన ఇనుప రాడ్డుతో అన్న రమేష్ ను కొట్టింది. దీంతో అత‌డు మృతి చెందాడు. తల్లి బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.