యాదాద్రిపై డ్రోన్ కెమెరా.. ఇద్దరిపై కేసు

విధాత: ప్రభుత్వ అనుమతి లేకుండా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయం పై డ్రోన్ కెమెరాతో చిత్రీకరణకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. సిఐ యాదయ్య తెలిపిన వివరాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా సింగారం గ్రామానికి చెందిన వంగరి చందు తుమ్మలగూడెం గ్రామానికి చెందిన నల్ల నిఖిలేష్ ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో టెంపుల్ సిటీ పెద్దగుట్ట ప్రాంతం నుంచి డ్రోన్ కెమెరాను ఎగరవేసి యాదాద్రి ప్రధానాలయాన్ని […]

యాదాద్రిపై డ్రోన్ కెమెరా.. ఇద్దరిపై కేసు

విధాత: ప్రభుత్వ అనుమతి లేకుండా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయం పై డ్రోన్ కెమెరాతో చిత్రీకరణకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

సిఐ యాదయ్య తెలిపిన వివరాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా సింగారం గ్రామానికి చెందిన వంగరి చందు తుమ్మలగూడెం గ్రామానికి చెందిన నల్ల నిఖిలేష్ ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో టెంపుల్ సిటీ పెద్దగుట్ట ప్రాంతం నుంచి డ్రోన్ కెమెరాను ఎగరవేసి యాదాద్రి ప్రధానాలయాన్ని చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.

ఇది గమనించిన దేవస్థానం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.