Earthquake | టర్కీ, సిరియాల్లో భారీ భూకంపం.. 2వేల మంది మృత్యువాత.. నిరాశ్రయులైన 2 కోట్ల మంది

రిక్టర్‌ స్కేల్‌పై 7.7 తీవ్రతతో ప్రకంపనలు మధ్యాహ్నం రెండో సారి ప్రకంపనలు 7.6 తీవ్రత Earthquake| సెంట్రల్‌ టర్కీ, సిరియాల్లో సోమవారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.7 తీవ్రతతో భూమి కంపించిందని జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ (GFZ) తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. గాజియాంటెప్ ప్రావిన్స్‌లోని నూర్దగి నగరానికి తూర్పున 26 కిలోమీటర్ల దూరంలో.. భూమికి 17.9 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారీ […]

Earthquake | టర్కీ, సిరియాల్లో భారీ భూకంపం.. 2వేల మంది మృత్యువాత.. నిరాశ్రయులైన 2 కోట్ల మంది
  • రిక్టర్‌ స్కేల్‌పై 7.7 తీవ్రతతో ప్రకంపనలు
  • మధ్యాహ్నం రెండో సారి ప్రకంపనలు 7.6 తీవ్రత

Earthquake| సెంట్రల్‌ టర్కీ, సిరియాల్లో సోమవారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.7 తీవ్రతతో భూమి కంపించిందని జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ (GFZ) తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. గాజియాంటెప్ ప్రావిన్స్‌లోని నూర్దగి నగరానికి తూర్పున 26 కిలోమీటర్ల దూరంలో.. భూమికి 17.9 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

భారీ భూకంపం కార‌ణంగా అందరూ చూస్తుండగానే బ‌హుళ అంతస్తుల భ‌వ‌నాలు కుప్ప‌కూలుతున్నాయి. ఆ భ‌వ‌నాల‌ను కూలడం చూసి స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ఇప్పటికే వేలాది భ‌వ‌నాలు నేల‌మ‌ట్టం అయ్యాయి. దీంతో వేల సంఖ్య‌లో జ‌నాలు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 1600 మందికి పైగా మృతి చెందారు. ప్రాణ న‌ష్టం భారీ సంఖ్య‌లో జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని స్థానిక మీడియా పేర్కొంటుంది. ఇవాళ తెల్ల‌వారుజామున 4:12 గంట‌ల‌కు సంభ‌వించిన భూకంపం.. ట‌ర్కీని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోండగా మళ్లీ మధ్యహ్నం 7.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది

ఈ భూకంప ధాటికి ట‌ర్కీలో 912 మంది, సిరియాలో 700 మందికి పైగా మృతి చెందారు. ఒక్క ట‌ర్కీలోనే దాదాపు 2828 బిల్డింగ్‌లు నేల‌మ‌ట్టం అయిన‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ దేశంలో ప్రాణ న‌ష్టం ఎంతగా ఉంటుందో అంచ‌నా వేయ‌వ‌చ్చు. ఇప్పుడిప్పుడు అక్క‌డ జ‌రిగిన బీభ‌త్సానికి చెందిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్నాయి.

టర్కీని మరోసారి వణించిన భూకంపం

ఇస్తాంబుల్‌ : టర్కీని వరుస భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం తెల్లవారు జామున రిక్టర్‌ స్కేల్‌పై 7.8తీవ్రతతో ప్రకంపనలతో చివురుటాకుల వణికిపోయిన టర్కీ.. మరికొద్ది గంటల్లోనే మరోసారి భూకంపం తాగింది. ఆగ్నేయ టర్కీలోని కహ్రామన్మరాస్ ప్రాంతంలో రెండోసారి భూకంపం సంభవించిందని ఆ దేశ విపత్తు, అత్యవసర నిర్వహణ అథారిటీ (AFAD) తెలిపింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో దక్షిణ టర్కీలో ప్రకంపనలు వచ్చాయని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది.

భూకంపం ధాటికి లెబనాన్‌, సిరియా, సైప్రస్‌లోనూ భూమి కంపించింది. వరుస భూకంపాలు టర్కీతో పాటు సిరియాలో పెను విషాదాన్ని మిగిల్చింది. వేలాది భవనాలు నేలమట్టమవగా.. ఇప్పటి వరకు దాదాపు 1600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు.. మృతదేహాలు, బాధితుల హాహాకారాలతో టర్కీ, సిరియా దద్దరిల్లుతున్నాయి.

ఇప్పటి వరకు టర్కీలో ఇప్పటి వరకు 1,040 మంది మృతి చెందగా.. సిరియాలోనే 700 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. భూకంపం నేపథ్యంలో దక్షిణ టర్కీలోని అదానా విమానాశ్రయాన్ని ప్రభుత్వం మూసివేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు విమానాశ్రయాన్ని మూసివేయాలని ఆదేశించింది.

అలాగే టర్కీ పైప్‌లైన్ ద్వారా చమురు ఎగుమతులను ఇరాకీ కుర్దిస్తాన్ తాత్కాలికంగా నిలిపివేసింది. టర్కీ నౌకాశ్రయం సెహాన్ పోర్ట్ ద్వారా చమురు రవాణా తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆ ప్రాంత సహజ వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. పైప్‌లైన్‌ను పరిశీలించిన తర్వాత ఎగుమతులను ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

భూకంపం ధాటికి టర్కీలో 2318 భవనాలు నేలమట్టమయ్యాయని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ పేర్కొన్నారు. 1939 తర్వాత ఇదే అతిపెద్ద విపత్తు అని తెలిపారు. భూకంపం కారణంగా సిరియాతో పాటు టర్కీలో దాదాపు మూడుకోట్ల మంది వరకు నిరాశ్రయులయ్యారు. ఇదిలా ఉండగా.. వరుస భూకంపాలతో భారీగా నష్టపోయిన టర్కీ, సిరియాను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఆయా దేశాల అధ్యక్షులు కోరారు.

ఈ క్రమంలో భారత్‌తో పాటు ప్రపంచదేశాలు ముందుకువచ్చాయి. టర్కీ ప్రజలకు భారత్‌ సంఘీభావంగా నిలుస్తుందని, విషాదాన్ని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు రెస్క్యూ బృందాలు, వైద్య బృందాలు, సహాయక సామగ్రిని పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.