Earthquake | ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. ప్రకంపనలకు 13 మంది మృతి

Earthquake | ప్రపంచాన్ని భూకంపాలు వణికిస్తూనే ఉన్నాయి. త్కురియే-సిరియాలో సంభవించిన భారీ భూకంపంలో 40వేల మందికిపైగా మృతి చెందిన ఘటనను మరిచిపోక ముందే ఈక్వెడార్‌లో భారీ భూకంపం సంభవించింది. గుయాస్‌ ప్రాంతంల 6.7 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. ఈక్వెడార్‌లో రెండో అతిపెద్ద నగరమైన గుయాక్విల్‌ పరిసరాల్లో భూకంపం సభవించినట్లు ఏపీ వార్త సంస్థ పేర్కొంది. భూకంపంలో ఇప్పటి వరకు 13 మంది మరణించినట్లుగా తెలిపింది. అలాగే పలుచోట్ల ఇండ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. […]

Earthquake | ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. ప్రకంపనలకు 13 మంది మృతి

Earthquake | ప్రపంచాన్ని భూకంపాలు వణికిస్తూనే ఉన్నాయి. త్కురియే-సిరియాలో సంభవించిన భారీ భూకంపంలో 40వేల మందికిపైగా మృతి చెందిన ఘటనను మరిచిపోక ముందే ఈక్వెడార్‌లో భారీ భూకంపం సంభవించింది. గుయాస్‌ ప్రాంతంల 6.7 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. ఈక్వెడార్‌లో రెండో అతిపెద్ద నగరమైన గుయాక్విల్‌ పరిసరాల్లో భూకంపం సభవించినట్లు ఏపీ వార్త సంస్థ పేర్కొంది. భూకంపంలో ఇప్పటి వరకు 13 మంది మరణించినట్లుగా తెలిపింది. అలాగే పలుచోట్ల ఇండ్లు, భవనాలు దెబ్బతిన్నాయి.

గుయాక్విల్‌కు దక్షణాన 50 మైళ్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమై ఉందని ఎస్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. భారీ ప్రకంపనల ధాటికి భవనాలు ఊగిపోయాయి. దాంతో జనం భవనాల్లో నుంచి బయటకు పరుగులు పెట్టారు. అలాగే ఉత్తర పెరూలో సైతం ప్రకంపనలు సంభవించాయి. ఇక్కడ కూడా భూకంపం కారణంగా ఒకరు మృతి చెందారు. శక్తివంతమైన భూకంపం వల్ల 12 మంది మరణించారని ఈక్వెడార్ అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో తెలిపారు. భూకంపం కారణంగా దక్షిణ ఈక్వెడార్, ఉత్తర పెరూలోని భవనాలు భారీగా దెబ్బతిన్నాయి.