Turkey Earthquake | టర్కీలో మరోసారి భూ ప్రకంపనలు.. రిక్టర్‌ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదు

Turkey Earthquake | ఇప్పటికే వరుస భూకంపాలు టర్కీలో పెను విధ్వంసం సృష్టించాయి. సోమవారం వరుసగా మూడుసార్లు వచ్చిన ప్రకంపనల ధాటిక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. టర్కీ, సిరియాలో ఇప్పటికే నాలుగువేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది శిథిలాల్లో చిక్కుకొని కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే మంగళవారం ఉదయం మరోసారి టర్కీని భూకంపం వణించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. ఉదయం 9.45 గంటల సమయంలో భూకంప […]

Turkey Earthquake | టర్కీలో మరోసారి భూ ప్రకంపనలు.. రిక్టర్‌ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదు

Turkey Earthquake | ఇప్పటికే వరుస భూకంపాలు టర్కీలో పెను విధ్వంసం సృష్టించాయి. సోమవారం వరుసగా మూడుసార్లు వచ్చిన ప్రకంపనల ధాటిక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. టర్కీ, సిరియాలో ఇప్పటికే నాలుగువేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది శిథిలాల్లో చిక్కుకొని కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే మంగళవారం ఉదయం మరోసారి టర్కీని భూకంపం వణించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. ఉదయం 9.45 గంటల సమయంలో భూకంప వచ్చిందని పేర్కొంది. ఇప్పటికే భూకంపం మృతుల సంఖ్య 4300 మార్క్‌ను దాటింది.

సిరియాలో ఇప్పటి వరకు 1444 మంది మృత్యువాతపడినట్లు అధికారులు ధ్రువీకరించారు. భారీ భూకంపాల తర్వాత టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతంలో దాదాపు వంద వరకు భూ ప్రకంపనలు రికార్డయ్యాయని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. సోమవారం వచ్చిన భారీ ప్రకంపనల ధాటికి టర్కీ, సిరియాలో దాదాపు నాలుగువేలకుపైగా బవనాలు కుప్పకూలాయి. భూకంపం కారణంగా దాదాపు 20వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని డబ్ల్యూహెచ్‌ఓ సీనియర్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు టర్కీ, సిరియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత్‌తో పాటు ప్రపంచదేశాలు సహాయాన్ని అందించేందుకు ముందుకువచ్చాయి. భారత్‌ డాగ్‌ స్క్వాడ్స్‌తో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను టర్కీకి పంపింది. దాంటో పాటు వైద్య సామగ్రిని పంపింది.