డ్రగ్స్ కేసు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, నటి రకుల్ ప్రీత్ సింగ్ లకు ఈడీ నోటీసులు
విధాత: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గత ఏడాది సెప్టెంబర్ 3న రకుల్‌ను ఈడీ అధికారులు విచారించిన విషయం విదితమే. అప్పుడు అత్యవసరంగా వెళ్లాల్సి ఉన్నదని రకుల్ మధ్యలోనే వెళ్లిపోయింది. దీంతో ఈడీ అధికారులు ఆమెను పూర్తిస్థాయిలో విచారించలేపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు హాజరుకావాలని ఆమెకు నోటీసులు జారీచేశారు. అలాగే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి కూడా ఈడీ […]

విధాత: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గత ఏడాది సెప్టెంబర్ 3న రకుల్‌ను ఈడీ అధికారులు విచారించిన విషయం విదితమే. అప్పుడు అత్యవసరంగా వెళ్లాల్సి ఉన్నదని రకుల్ మధ్యలోనే వెళ్లిపోయింది.
దీంతో ఈడీ అధికారులు ఆమెను పూర్తిస్థాయిలో విచారించలేపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు హాజరుకావాలని ఆమెకు నోటీసులు జారీచేశారు. అలాగే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది.
ఆయన వ్యాపార లావాదేవీలపై విచారించనున్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి జరిపిన ఆర్థికలావాదేవీలు, కంపెనీల వ్యవహారంపై ఈడీ దృష్టిసారించినట్లు, వీటిపై రోహిత్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. నోటీసులు అందిన విషయాన్ని పైలట్ కూడా ధృవీకరించారు. ఈడీ అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు జవాబులు ఇస్తానని ఆయన తెలిపారు.
నోటీసులు అందాయి: ఎమ్మెల్యే
ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులు అందాయని పేర్కొన్నారు. వ్యాపారాలు, కంపెనీల వివరాలు తీసుకురావాలని ఈడీ అధికారులు సూచించారని వెల్లడించారు. 19వ తేదీన ఉదయం పదిన్నర గంటలకు హైదరాబాద్ ఆఫీసుకు హాజరు కావాలని ఈడీ సూచించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తన న్యాయవాదితో రోహిత్ రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఈడీ నోటీసులపై చట్టపరంగా ఏం చేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
ED notices I received asking to appear on 19Dec are as plain as Bandi Sanjay’s head – BRS MLA Pilot Rohit Reddy
Asks Does Bandi Sanjay know how to predict future.. 2days after he named me I got notices..!
Says will respond legally pic.twitter.com/ERgiA3T6vn
— Naveena Ghanate (@TheNaveena) December 16, 2022