Allu Aravind| అల్లు అరవింద్ ను విచారించిన ఈడీ

విధాత, హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ శుక్రవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్‌లో అల్లు అరవింద్ ను ఈడీ విచారించింది. బ్యాంకులో 2018-19లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి సుమారు మూడు గంటల పాటు ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. యూనియన్ బ్యాంకు నుంచి రూ. 101 కోట్ల రుణాలను రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంకు తీసుకుంది. తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించకపోవడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు ఆధారంగా దీనిని ఈడీ దర్యాప్తు చేపట్టంది.
రామకృష్ట ఎలక్ట్రానిక్స్ నుంచి అల్లు సంస్థలు లావాదేవీలు జరిపినట్లు ప్రాధమిక ద్యర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసులో ఈడీ అల్లు అరవింద్ ను విచారించింది. బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలలో అల్లు అరవింద్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేశారు. బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోలుపై వివారాలను ఈడీ అడిగి తెలుసుకుంది. వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ అల్లు అరవింద్ ను ఆదేశించింది.