చేపల చెరువుల పేరుతో 311కోట్ల స్కామ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
చేపల చెరువుల పేరుతో 311కోట్ల స్కామ్ జరిగిందన్న ఆరోపణల నేపధ్యంలో ఏపీ, తెలంగాణలో 6 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది.

విధాత: చేపల చెరువుల పేరుతో 311కోట్ల స్కామ్ జరిగిందన్న ఆరోపణల నేపధ్యంలో ఏపీ, తెలంగాణలో 6 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. పలు కంపనీలు రైతుల పేరుతో కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు, చేపల చెరువుల నిర్మాణ రుణాలు తీసుకుని మోసం చేసినట్లుగా వచ్చిన సమాచారంతో ఈడీ సోదాలు కొనసాగిస్తుంది. సంబంధిత కంపనీలలో తనిఖీలు చేపట్టి రికార్డులను పరిశీలిస్తుంది.