WhatsApp | వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ గురించి గమనించారా..?

WhatsApp | వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు వాట్సాప్‌ సరికొత్త ఫీచర్లను తీసుకువస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్‌ మరో ఆప్షన్‌ను యూజర్లందరికీ ఎడిట్‌ ఆప్షన్‌ను తీసుకువచ్చింది. యూజర్లు ఎవరికైనా మెస్సేజ్‌ పంపిన సందర్భంలో ఎవైనా తప్పులు ఉంటే 15 నిమిషాల్లోపు వాటిని సరిదిద్దే అవకాశం ఉంటుంది. మొన్నటి వరకు టెస్టింగ్‌ దశలో ఉండగా.. విజయవంతం కావడంతో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ యాప్‌లో ఎడిట్ మెసేజ్ ఫీచర్ ఇవ్వలేదు. కేవలం టెక్ట్స్‌ […]

WhatsApp | వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ గురించి గమనించారా..?

WhatsApp | వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు వాట్సాప్‌ సరికొత్త ఫీచర్లను తీసుకువస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్‌ మరో ఆప్షన్‌ను యూజర్లందరికీ ఎడిట్‌ ఆప్షన్‌ను తీసుకువచ్చింది.

యూజర్లు ఎవరికైనా మెస్సేజ్‌ పంపిన సందర్భంలో ఎవైనా తప్పులు ఉంటే 15 నిమిషాల్లోపు వాటిని సరిదిద్దే అవకాశం ఉంటుంది. మొన్నటి వరకు టెస్టింగ్‌ దశలో ఉండగా.. విజయవంతం కావడంతో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రస్తుతం వాట్సాప్ యాప్‌లో ఎడిట్ మెసేజ్ ఫీచర్ ఇవ్వలేదు. కేవలం టెక్ట్స్‌ మెసేజెస్‌కు మాత్రమే ఆప్షన్‌ ఉంది. ఎడిట్ ఆప్షన్ ద్వారా వీడియోలు, ఫొటోలు, క్యాప్షన్లను కూడా పంపించిన తర్వాత 15 నిముషాల సమయంలో ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది.

వాట్సాప్‌లో ఎవరికైనా మెసెజ్ పంపించిన తర్వాత ఏదైనా తప్పు ఉందనిపిస్తే.. పంపించిన సందేశంపై ట్యాప్ చేసి కొద్దిసేపు ప్రెస్‌ చేయాలి. ఆ తర్వాత మెనూలోకి వెళ్లి ఎడిట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. యాపిల్ ఫోన్లలో అయితే మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేసి.. ఎడిట్ ఆప్షన్లపై ట్యాప్ చేయాలి.

డెస్క్ టాప్‌లో అయితే మెసేజ్ మెనూలోకి వెళ్లి ఎడిట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మెస్సేజ్‌ను ఎడిట్‌ చేసిన తర్వాత చెక్ మార్క్‌పై ట్యాప్ చేస్తే మెసెజ్ అప్‌డేట్ అవుతుంది.