అరటి పండు ఇవ్వలేదని మావటిని చంపిన ఏనుగు
విధాత: ఓ గజ రాజు తన మావటిపై గర్జించింది. సమయానికి అరటి పండు ఇవ్వలేదనే కోపంతో మావటిపై ఆ ఏనుగు విరుచుకుపడింది. తొండెంతో ఆ వ్యక్తిని పైకి లేపి నేలకేసి బాదింది. దీంతో తీవ్ర గాయాలపాలైన మావటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సియోనిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. భరత్ వాసుదేవ్(56), గోవింద్ గిరి అనే వ్యక్తులిద్దరూ ఓ ఏనుగుతో గ్రామాల్లో తిరుగుతూ, ప్రజలకు వినోదం కల్పించేవారు. ఏనుగుపై పిల్లలను […]

విధాత: ఓ గజ రాజు తన మావటిపై గర్జించింది. సమయానికి అరటి పండు ఇవ్వలేదనే కోపంతో మావటిపై ఆ ఏనుగు విరుచుకుపడింది. తొండెంతో ఆ వ్యక్తిని పైకి లేపి నేలకేసి బాదింది. దీంతో తీవ్ర గాయాలపాలైన మావటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సియోనిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. భరత్ వాసుదేవ్(56), గోవింద్ గిరి అనే వ్యక్తులిద్దరూ ఓ ఏనుగుతో గ్రామాల్లో తిరుగుతూ, ప్రజలకు వినోదం కల్పించేవారు. ఏనుగుపై పిల్లలను ఎక్కించి సరదాగా తిప్పుతూ డబ్బులు సంపాదించేవారు. అయితే బండోల్ గ్రామ సమీపంలో విశ్రాంతి కోసం వాసుదేవ్, గిరి ఆగారు.
అటుగా వెళ్తున్న ఓ ట్రక్కు డ్రైవర్ ఏనుగును గమనించి, అరటి పండ్ల గుత్తిని వాసుదేవ్‌కు ఇచ్చాడు. ఆ అరటి పండ్లను ఏనుగుకు ఇవ్వకుండా తన బ్యాగులో దాచి పెట్టుకున్నాడు. కొంత సమయం వరకు ఏనుగు వేచి చూసింది. అయినా అరటి పండ్లను ఏనుగుకు ఇవ్వలేదు.
దీంతో కోపంతో ఊగిపోయిన ఏనుగు.. వాసుదేవ్‌ను తన తొండెంతో పైకి లేపి బలంగా కింద పడేసింది. వాసుదేవ్ స్పృహ కోల్పోవడంతో.. గిరి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, వాసుదేవ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
ఏనుగును పరీక్షించిన వెటర్నరీ వైద్యులు
వాసుదేవ్‌ను చంపేసిన ఏనుగును వెటర్నరీ వైద్యులు పరీక్షించారు. ఏనుగు మానసికంగా బాగానే ఉందని నిర్ధారించారు. అయితే ఏనుగును గిరికి అప్పగించాలా? లేదా పెంచ్ నేషనల్ పార్క్‌కు తరలించాలా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు.