రేష‌న్ షాపులపై దాడి చేసి.. బియ్యం తింటున్న ఏనుగు

బెంబేలెత్తుతున్న స్థానికులు Kerala | కేర‌ళ‌లో ఓ ఏనుగు (Elephant) బీభ‌త్సం సృష్టిస్తోంది. స్థానికుల‌కు బెంబేలెత్తిస్తోంది. రేష‌న్ దుకాణాల‌ ( Ration Shops )పై ప‌దేప‌దే దాడులు చేస్తూ.. బియ్యం, చ‌క్కెర‌, గోధుమ‌ల‌ను ఆర‌గిస్తూ.. విధ్వంసం సృష్టిస్తోంది. ఈ క్ర‌మంలో రేష‌న్ షాపుల య‌జ‌మానులు, స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఇడుక్కి జిల్లాలోని సంథన్‌పార గ్రామంలోని అరికొంబ‌న్ అనే ఏనుగు త‌రుచూ ప్ర‌వేశిస్తుంటుంది. అయితే ఆ ఏనుగు రేషన్ షాపుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు […]

రేష‌న్ షాపులపై దాడి చేసి.. బియ్యం తింటున్న ఏనుగు

బెంబేలెత్తుతున్న స్థానికులు

Kerala | కేర‌ళ‌లో ఓ ఏనుగు (Elephant) బీభ‌త్సం సృష్టిస్తోంది. స్థానికుల‌కు బెంబేలెత్తిస్తోంది. రేష‌న్ దుకాణాల‌ ( Ration Shops )పై ప‌దేప‌దే దాడులు చేస్తూ.. బియ్యం, చ‌క్కెర‌, గోధుమ‌ల‌ను ఆర‌గిస్తూ.. విధ్వంసం సృష్టిస్తోంది. ఈ క్ర‌మంలో రేష‌న్ షాపుల య‌జ‌మానులు, స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఇడుక్కి జిల్లాలోని సంథన్‌పార గ్రామంలోని అరికొంబ‌న్ అనే ఏనుగు త‌రుచూ ప్ర‌వేశిస్తుంటుంది. అయితే ఆ ఏనుగు రేషన్ షాపుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు పాల్ప‌డుతుంది. ఎందుకంటే ఆ గ‌జ‌రాజుకు బియ్యం తిన‌డం అంటే మ‌హా ఇష్టం. ఈ క్ర‌మంలో రేషన్ దుకాణాల‌పై ప‌దేప‌దే దాడులు చేస్తూ బియ్యం, గోధుమ‌ల‌తో పాటు చ‌క్కెర‌ను తినేస్తుంది.

తాజాగా శ‌నివారం ఉద‌యం స్థానికంగా ఉన్న ఓ రేష‌న్ షాపులోకి ఏనుగు ప్ర‌వేశించింది. ఈసారి రెండు బియ్యం బ‌స్తాల‌ను స్వాహా చేసింది. అరికొంబ‌న్ అనే ఏనుగు ఎప్పుడు వ‌స్తుందో.. ఎప్పుడు దాడి చేస్తుందో తెలియ‌ద‌ని రేష‌న్ షాపు య‌జ‌మాని పేర్కొన్నాడు. ఈ ఏనుగు ముఖ్యంగా బియ్యం తినేందుకు ఆస‌క్తి చూపుతుంద‌ని తెలిపాడు. అందుకే ఈ గ‌జ‌రాజుకు అరికొంబ‌న్(అరి అన్నం.. కొంబ‌న్ ఏనుగు) అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు స్థానికులు వివ‌రించారు.

ఇక అరికొంబ‌న్ దాదాపు 10 సార్లు రేష‌న్ దుకాణాల‌పై దాడులు చేసింది. ఆ గ్రామంలో 60 ఇండ్ల‌ను ధ్వంసం చేసింది. దేవికులం రేంజ్‌లో దాదాపు 10 మందిని చంపిన‌ట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఏనుగును ప‌ట్టుకునేందుకు అట‌వీశాఖ అధికారులు రెండు సార్లు య‌త్నించి, విఫ‌ల‌మ‌య్యారు.