Viral Video | ఈ ఏనుగు తెలివి చూస్తే ఫిదా అవ్వాల్సిందే..! మీరూ ఓసారి లుక్కేయండి..!
Viral Video | మిగితా జంతువులతో పోలిస్తే ఏనుగులు కాస్త తెలివైనవే. వాటి తెలివిని చూసి అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఇప్పటికే కొన్ని ఏనుగులు తమ చేష్టలతో నువ్వుల పువ్వులు పూయించగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘మేం చాలా తెలివైన వాళ్లం!! ఈ ఏనుగు ఎంత […]

Viral Video | మిగితా జంతువులతో పోలిస్తే ఏనుగులు కాస్త తెలివైనవే. వాటి తెలివిని చూసి అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఇప్పటికే కొన్ని ఏనుగులు తమ చేష్టలతో నువ్వుల పువ్వులు పూయించగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘మేం చాలా తెలివైన వాళ్లం!! ఈ ఏనుగు ఎంత తెలివిగా పవర్ కంచెని బద్దలు కొడుతుందో చూడండి. సహంతో’ అని వీడియో ట్యాగ్ చేశారు. అడవి జంతువులు రోడ్డుపైకి రాకుండా విద్యుత్ కంచెను ఉన్నది.
We are too smart hooman !! See how this elephant is smartly breaking power fence. With patience. pic.twitter.com/0ZLqWvmxdu
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 5, 2022
అటుగా వచ్చిన ఏనుగు కంచెను తీక్షణంగా పరిశీలించింది. ఆ తర్వాత భారీ పాదంతో మెల్లి మెల్లిగా కంచెను తాకుతూ కరెంటు ఉందా? లేదా? అని పలుసార్లు పరీక్షించింది. కరెంటు సరఫరా లేదని తెలుసుకున్న కాలితో కంచెను నెట్టి దాటి వచ్చింది. ఏనుగు తెలివిని చూసి నెటిన్లు ఫిదా అవుతున్నారు. అయితే, ఇది పాత వీడియోనే అయినా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
ఈ వీడియోను దాదాపు 95వేల మంది వరకు వీక్షించగా.. 5వేలకుపైగా లైక్స్ వచ్చాయి. 642 మంది రీట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు తమదైన స్టయిల్‌లో స్పందిస్తున్నారు. ఏనుగు తెలివైందని, మానవులు భూమిని ఆక్రమించి ప్రతిచోటా అడ్డంకులు సృష్టించినప్పుడు ఇతర జాతులు ఏం చేస్తాయని ఓ నెటిజన్ స్పందించగా.. అవి ఇతరులకు హాని కలిగించాలని ఎప్పుడూ అనుకోవాలని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.
Read Also : smoking | ధూమపానంతో అకాల మరణాలు..! హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..!