రేపిస్టు ఆడియో రికార్డు చేసిన బాధితురాలు!

విధాత: నమ్మించి మోసం చేసి అత్యాచారం చేయటమే కాదు, నేరం నుంచి తప్పించుకొనేందుకు కోర్టులో అబద్ధమాడిన ఉదంతాన్ని, అప్పుడు బాధితురాలిగా అనుభవించిన క్షోభను సమాజంతో పంచుకొంటున్నది యూకేలో ఓ బాధిత విద్యార్థిని. రేపిస్టుతో చర్చించిన విషయాన్ని బ్యాగులో పెట్టుకొన్న సెల్‌తో ఆడియో రికార్డ్‌ చేసి.. రేపిస్టులు ఎంతటి మోసానికి పాల్పడుతున్నారో ప్రపంచానికి తెలియజేసింది. ఇప్పుడా ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. యూకేలోని గ్లాస్గో యూనివర్సిటీలో ఎల్లీ విల్సన్‌ అనే 25 ఏండ్ల విద్యార్థిని పొలిటికల్ సైన్స్‌ చదువుతున్నది. […]

  • By: krs    latest    Jan 21, 2023 9:12 AM IST
రేపిస్టు ఆడియో రికార్డు చేసిన బాధితురాలు!

విధాత: నమ్మించి మోసం చేసి అత్యాచారం చేయటమే కాదు, నేరం నుంచి తప్పించుకొనేందుకు కోర్టులో అబద్ధమాడిన ఉదంతాన్ని, అప్పుడు బాధితురాలిగా అనుభవించిన క్షోభను సమాజంతో పంచుకొంటున్నది యూకేలో ఓ బాధిత విద్యార్థిని. రేపిస్టుతో చర్చించిన విషయాన్ని బ్యాగులో పెట్టుకొన్న సెల్‌తో ఆడియో రికార్డ్‌ చేసి.. రేపిస్టులు ఎంతటి మోసానికి పాల్పడుతున్నారో ప్రపంచానికి తెలియజేసింది. ఇప్పుడా ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.

యూకేలోని గ్లాస్గో యూనివర్సిటీలో ఎల్లీ విల్సన్‌ అనే 25 ఏండ్ల విద్యార్థిని పొలిటికల్ సైన్స్‌ చదువుతున్నది. అదే యూనివర్సిటీలో మెక్‌ ఫొర్లాన్‌ వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. దాన్ని ఆసరా చేసుకొని ఫొర్లాన్‌ మోసపూరితంగా ఎల్లీ విల్సన్‌పై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఒకసారి కాదు రెండు మార్లు ఈ దురాఘాతానికి పాల్పడ్డాడు. చేసిన మోసానికి గాను విల్సన్‌ యూనివర్సిటీ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కోర్టు విచారణలో ఫొర్లాన్‌.. తాను అమాయకుడినని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టులో చెప్పుకొచ్చాడు. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ సందర్భంగా కూడా ఎల్లీ విల్సన్‌ కళ్లలోకి సూటిగా చూస్తూ.. తానే తప్పు చేయలేదని అన్నాడు. తనపై తప్పుడు ఆరోపణ చేస్తున్నదని బుకాయించాడు. దీంతో అతడు చేసిన నేరానికి గరిష్ట శిక్ష బదులుగా, కనిష్టంగా ఐదేండ్ల శిక్షను కోర్టు ఖరారు చేసింది. దీంతో ఎల్లీ విల్సన్‌ తీవ్ర నిరాశ‌కు గురయింది.

ఎల్లీ విల్సన్‌ తనకు జరిగిన అన్యాయం, సమాజంలో తప్పులు చేసిన వారు ఎలా తప్పించుకు తిరుగు తున్నారో, జనాన్ని ఎలా మోసం చేస్తున్నారో తెలియజేయాలని నిర్ణయించుకున్నది. అన్యాయానికి గురైన వారి తరపున పోరాడేందుకు సంసిద్ధమైంది. ఆ క్రమంలోనే తనపై అత్యాచారం చేసిన ఫొర్లాన్‌ దగ్గరికి బ్యాగులో సెల్‌ఫోన్‌ పెట్టుకొని పోయి కోర్టు తీర్పు జరిగిన ఘటన గురించి చర్చించింది.

‘జరిగిన విషయం గురించి కోర్టులో అబద్ధం చెప్పేటప్పుడు నీకు సిగ్గనిపించలేదా..’ అని విల్సన్‌ ఫొర్లాన్‌ను అడిగింది. అప్పుడతను.. ‘చూడు విల్సన్‌.. నన్ను నమ్మే వారు నమ్ముతారు. నేను నిజం చెప్పాలని అనిపించినప్పుడు చెప్తాను. ఇప్పుడు మాత్రం కాదు..’ అని చెప్పుకొచ్చాడు. అలాగే.. ‘నేరం అంగీకారానికి సంబంధించి నీ దగ్గర ఆడియో, అంగీకార పత్రాలు ఉన్నా.. అవన్నీ జ్యూరీలో అందరూ నమ్ముతారను కోవటం లేదు. దీన్ని బట్టి సమాజం ఎలా ఉన్నదో నీకే తెలిసి వస్తుంది..’ అంటూ ఇప్పుడున్న సమాజంలోని నీతి గురించి భరోసా వ్యక్తం చేశాడు.

ఇప్పుడు.. ఎల్లీ విల్సన్‌ ఓ సామాజిక కార్యకర్తగా బాధితుల తరపున న్యాయం కోసం పోరాడుతున్నారు. అలాగే సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాడుల విషయంలో పురుషులు, సమాజం ఎంత నిర్లక్ష్యంగా, పక్షపాతంగా ఉన్నదో తన అనుభవాన్నే ఓ పాఠంగా చెప్తున్నది. ప్రజలను చైతన్యం చేస్తున్నది. యూనివర్సిటీ అధికారులు కూడా విద్యార్థుల భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్తున్నారు. నేరాలు జరిగినప్పుడు దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకొంటామని అంటున్నారు.