Emergency Alert | పెద్ద బీప్ సౌండ్‌తో ఫోన్‌కు మెసేజ్ వ‌చ్చిందా? కంగారు ప‌డ‌క్క‌ర్లేదు

Emergency Alert విధాత‌: దేశ‌వ్యాప్తంగా గురువారం ఉద‌యం 11:41 గంట‌ల‌కు చాలా మంది సెల్‌ఫోన్ల‌కు ఒక అలెర్ట్ మెసేజ్ వ‌చ్చింది. పెద్ద బీప్ సౌండ్‌తో, ఆడియో రూపంలోనూ హ‌ఠాత్తుగా వ‌చ్చిన ఈ సందేశాన్ని చూసి చాలా మంది పౌరులు ఆందోళ‌న చెందారు. ఆ స్క్రీన్ షాట్ల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పంచుకోవ‌డంతో తీవ్రంగా చ‌ర్చ న‌డిచింది. త‌మ ఫోన్ల‌ను ఎవ‌రైనా హ్యాక్ చేశారా? లేదా బ్యాంకు నుంచి డ‌బ్బులు కొట్టేయ‌డానికి సైబ‌ర్ నేర‌గాళ్లు ఉచ్చు ప‌న్నారా అని ఆందోళ‌న […]

Emergency Alert | పెద్ద బీప్ సౌండ్‌తో ఫోన్‌కు మెసేజ్ వ‌చ్చిందా? కంగారు ప‌డ‌క్క‌ర్లేదు

Emergency Alert

విధాత‌: దేశ‌వ్యాప్తంగా గురువారం ఉద‌యం 11:41 గంట‌ల‌కు చాలా మంది సెల్‌ఫోన్ల‌కు ఒక అలెర్ట్ మెసేజ్ వ‌చ్చింది. పెద్ద బీప్ సౌండ్‌తో, ఆడియో రూపంలోనూ హ‌ఠాత్తుగా వ‌చ్చిన ఈ సందేశాన్ని చూసి చాలా మంది పౌరులు ఆందోళ‌న చెందారు. ఆ స్క్రీన్ షాట్ల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పంచుకోవ‌డంతో తీవ్రంగా చ‌ర్చ న‌డిచింది.

త‌మ ఫోన్ల‌ను ఎవ‌రైనా హ్యాక్ చేశారా? లేదా బ్యాంకు నుంచి డ‌బ్బులు కొట్టేయ‌డానికి సైబ‌ర్ నేర‌గాళ్లు ఉచ్చు ప‌న్నారా అని ఆందోళ‌న చెందారు. మ‌రికొంత మంది ఆ సందేశంలోని ఎమ‌ర్జెన్సీ అన్న ప‌దం చూసి కేంద్ర ప్ర‌భుత్వం హ‌ఠాత్తుగా ఏమైనా ఆంక్ష‌లు విధించిందా అని భావించారు.

అయితే ఈ మెజేజ్‌ల‌పై కేంద్ర టెలిక‌మ్యునికేష‌న్ శాఖ స్పందించింది. ప్ర‌కృతి విప‌త్తులు, ఎమ‌ర్జెన్సీ త‌ర‌హా ప‌రిస్థితులు సంభ‌వించిన‌ప్పుడు దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఏక కాలంలో టెక్ట్స్‌, ఆడియో రూపంలో మెసేజ్‌ల‌ను పంపే విధానాన్ని ప‌రీక్షిస్తున్నామ‌ని, అందులో భాగంగానే ఈ మెసేజ్‌ల‌ను పంపామ‌ని తెలిపింది.

దీంతో ఆ మెసేజ్ పొందిన‌ వారంతా ఊపిరి పీల్చుకున్నారు. దేశవ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో ద‌శ‌ల వారీగా ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు టెలిక‌మ్యూనికేష‌న్ శాఖ ఇది వ‌ర‌కే తెలిపింది. గ‌తంలో జులై 20న‌, ఆగ‌స్టు 17న కూడా కొంద‌రు యూజ‌ర్ల‌కు ఈ సందేశం వ‌చ్చింది.

ఎమర్జన్సీ అలర్ట్ మెసేజ్‌కు కేటీఆర్ షాక్‌

విధాత, దేశ వ్యాప్తంగా మొబైల్ ఫోన్ వినియోగదారులను కలవర పెట్టిన ఎమర్జన్సీ అలర్ట్ మెసేజ్‌కు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కూడా కంగారు పడ్డారు. కేటీఆర్ ఓ ఐటీ కంపనీ సదస్సులో మాట్లాడుతుండగా అక్కడున్నమొబైల్స్‌కు ఒక్కసారిగా అలర్ట్ మెసేజ్ బీప్ సౌండ్ వచ్చింది. ప్రసంగం మధ్యలో వచ్చిన అలర్ట్ మెసేజ్‌ను మంత్రి కేటీఆర్ ఫైర్ అలర్ట్ అనుకున్నారు.

అలర్ట్ మెసేజ్‌తో షాక్ అయిన కేటీఆర్ ఇది ఫైర్ అలారమేనా..మనమందరం ఇక్కడి నుండి వెళ్లిపోవాలా అని, నాకు తెలిసి ఇది ఫైర్ అలారమేనన్నారు. స్పీకర్ సౌండ్ అని ఓ వ్యక్తి చెప్పగా, క్లోజ్‌డ్ ఆడిటోరియంలో ఉన్నామని గుడ్ లక్ గాయ్స్ అంటూ కేటీఆర్ అందరిని నవ్వించి తన ప్రసంగం కొనసాగించారు.