పబ్లిక్‌లో.. షాద్‌నగర్ ఎమ్మెల్యేను కొట్టిన ఎర్రబెల్లి! నిజమేనా (వీడియో వైరల్)

విధాత: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీరుపై సొంత పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో ఓ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఎర్రబెల్లి సొంత పార్టీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తలపై కొట్టారు. మంత్రి అల కొట్టడానికి కారణమైతే తెలియరాలేదు.
అక్కడే ఉన్న పార్టీ నాయకులు, అధికారులు మంత్రి తీరును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పది మందిలో ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వకుండా మంత్రి వ్యవహారించిన తీరును తప్పుబడుతున్నారు. అయితే వారి మధ్య సాగిన చర్చలో ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతోనే మంత్రి అంజయ్య యాదవ్‌పై మొట్టికాయ వేశారని చెబుతున్నా వీడియో మాత్రం జనంలో చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యే వివరణ..
సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్న వీడియోపై సదరు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వివరణ ఇచ్చారు. మంత్రి నాకు చాలా సన్నిహితుడని ఓ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి నేను ఏ స్థాయిలో డెవలప్‌మెంట్ చేశానో చెబుతూ అలా చేయి లేపాడని నన్ను అసలు కొట్టలేదని స్పష్టం చేశారు. వీడియోలో మాత్రం మంత్రి నన్ను కొట్టినట్లుగా కనిపిస్తున్నదని దాన్ని మరో విధంగా ప్రతిపక్షా పార్టీలు సోషల్ మీడియాలో పనిగట్టుకుని వైరల్ చేస్తున్నాయని అన్నారు.