Amritpal Singh | 80వేల మంది పోలీసులున్నా.. అమృత్‌పాల్‌ తప్పించుకున్నాడా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పణకు ఆదేశం Amritpal Singh । ఖలిస్తాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh) పరారవడంపై పంజాబ్‌ హర్యానా హైకోర్టు(Punjab Haryana High Court) పోలీసుల(police)పై సీరియస్‌ అయ్యింది. 80వేల మంది పోలీసులు ఉన్నా.. అతడు ఎలా తప్పించుకుపోయాడని ప్రశ్నించింది. ఈ ఆపరేషన్‌(Oparation) విషయంలో స్టేటస్‌ రిపోర్టు(Status Report) సమర్పించాలని ఆదేశించింది. విధాత: ఖలిస్తాన్‌(Khalistan)వేర్పాటువాది అమృత్‌పాల్‌సింగ్‌ను పట్టుకునేందుకు నిర్వహించిన ఆపరేషన్‌ విషయంలో స్టేటస్‌ రిపోర్ట్‌ను సమర్పించాలని పంజాబ్‌ హర్యానా హైకోర్టు (Punjab and Haryana High […]

Amritpal Singh | 80వేల మంది పోలీసులున్నా.. అమృత్‌పాల్‌ తప్పించుకున్నాడా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
  • స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పణకు ఆదేశం

Amritpal Singh । ఖలిస్తాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh) పరారవడంపై పంజాబ్‌ హర్యానా హైకోర్టు(Punjab Haryana High Court) పోలీసుల(police)పై సీరియస్‌ అయ్యింది. 80వేల మంది పోలీసులు ఉన్నా.. అతడు ఎలా తప్పించుకుపోయాడని ప్రశ్నించింది. ఈ ఆపరేషన్‌(Oparation) విషయంలో స్టేటస్‌ రిపోర్టు(Status Report) సమర్పించాలని ఆదేశించింది.

విధాత: ఖలిస్తాన్‌(Khalistan)వేర్పాటువాది అమృత్‌పాల్‌సింగ్‌ను పట్టుకునేందుకు నిర్వహించిన ఆపరేషన్‌ విషయంలో స్టేటస్‌ రిపోర్ట్‌ను సమర్పించాలని పంజాబ్‌ హర్యానా హైకోర్టు (Punjab and Haryana High Court) పంజాబ్‌ పోలీసులను ఆదేశించింది.

‘మీకు 80వేల మంది పోలీసులు ఉన్నారు. అయినా అమృత్‌పాల్‌సింగ్‌ (Amritpal Singh) ఎలా తప్పించుకున్నాడు?’ అని పంజాబ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది రాష్ట్ర పోలీసుల వైఫల్యమేనని వ్యాఖ్యానించింది.

అమృత్‌పాల్‌సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్‌ ప్రభుత్వం గత శనివారం భారీ ఆపరేషన్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో ఆయన అనుచరులు 78 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ.. అమృత్‌పాల్‌సింగ్‌ పోలీసులు తరుముతున్నా.. జలంధర్‌ జిల్లాలో దొరికినట్టే దొరికి తప్పించుకుపోయాడు.

అతడి ఆచూకీ కోసం పంజాబ్‌ పోలీసులు జల్లెడ పడుతున్నారు. పాకిస్తాన్‌ ఏజెంట్‌గా పోలీసులు భావిస్తున్న అమృత్‌పాల్‌సింగ్‌.. జలంధర్‌లో శనివారం సాయంత్రం ఒక మోటార్‌ బైక్‌ను వేగంగా నడుపుతూ పారిపోవడం పోలీసులు గమనించారు. అతడిని వెంటాడినా.. దొరక్కుండా తప్పించుకుపోయాడు.