Arogya Sri | ఆ రేషన్‌కార్డు లేకున్నా ఇక ఆరోగ్యశ్రీ..!
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రేషన్‌కార్డు ఉన్న వారికే ఆరోగ్యశ్రీ కార్డు అనే నిబంధన అమలులో ఉన్నది.

- రేవంత్‌రెడ్డి సర్కారు కీలక నిర్ణయం..!
Arogya Sri | సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రేషన్‌కార్డు ఉన్న వారికే ఆరోగ్యశ్రీ కార్డు అనే నిబంధన అమలులో ఉన్నది. దీన్ని సవరించాలని యోచిస్తున్నది. వైద్య ఆరోగ్యశాఖ సీఎం సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.
ఇందులో భాగంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డుకు ఆధార్ తరహాలో ఒక విశిష్ట నంబర్‌ను కేటాయించాలని ఆదేశించారు. దాంతో అత్యవసర పరిస్థితుల్లో ఎరికైనా వైద్యం అందించేందుకు వీలుంటుందని.. హెల్త్ ప్రొఫైల్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుకోసం తెల్ల రేషన్‌కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఆరోగ్యశ్రీ సేవల పరిమితి రూ.5లక్షల వరకు ఉన్నది. గతంలో రూ.2లక్షల వరకే పరిమితి ఉండగా.. గత సంవత్సరం అప్పటి ప్రభుత్వం రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు పరిమితిని పెంచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10లక్షలకు పెంచాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ ఇటీవలి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ మేరకు రూ.10లక్షలకు పెంచింది. ప్రస్తుతం తెలంగాణలో 77.19 లక్షల కార్డులున్నాయి. 1,310 ఆసుపత్రిల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. ఇందులో 293 ప్రైవేట్ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇందులో దాదాపు అన్ని రోగాలకు సేవలు అందుతున్నాయి.