ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట కలపడమే: సోము వీర్రాజు

విధాత‌, అమరావతి: ఎన్‌టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ హెల్త్ యూనివర్శీటి ఎమెండ్ మెంట్ బిల్లును ప్రవేశపెట్టడం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట కలపడమేనని సోమువీర్రాజు మండిపడ్డారు. ప్రజా పోరు కార్యక్రమంలో ఉన్న ఆయ‌న‌ అసెంభ్లీలో జరిగిన గందరగోళం తెలుసుకుని ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్య […]

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట కలపడమే: సోము వీర్రాజు

విధాత‌, అమరావతి: ఎన్‌టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ హెల్త్ యూనివర్శీటి ఎమెండ్ మెంట్ బిల్లును ప్రవేశపెట్టడం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట కలపడమేనని సోమువీర్రాజు మండిపడ్డారు.

ప్రజా పోరు కార్యక్రమంలో ఉన్న ఆయ‌న‌ అసెంభ్లీలో జరిగిన గందరగోళం తెలుసుకుని ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకుని వచ్చేందుకు ఎన్టీఆర్ పడిన తపన గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంద‌న్నారు.

ప్రభుత్వం ఒక దురుద్దేశ్యంతో, కుట్రపూరితంగా దొడ్డి దోవన ఎన్టీఆర్ పేరుకు మ‌చ్చ‌ తెచ్చేలా వ్యవహరించిందని విమ‌ర్శించారు. విచిత్రంగా ఎన్టీఆర్ పేరు బదులు వైఎస్ఆర్ పేరు ఏవిధంగా పెడతారని, ఇది దుర్మార్గమ‌ని సోమువీర్రాజు అభిప్రాయపడ్డారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి ఎప్పడు వచ్చారో చెప్పాలని సోమువీర్రాజు ప్రశ్నించారు. ysrను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటే వైసీపీ మాత్రం వైఎస్ఆర్ పేరును రాష్ట్రమంతా పెట్టే విధంగా వ్యవహరిస్తున్నందున ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వాలన్నారు.

జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇస్తున్నది కేంద్రమైతే అంబటి రాంబాబు అసెంభ్లీ సాక్షిగా అబద్దాలు చెప్తు రాష్ట్రం ప్రభుత్వం సొంత విషయంగా ఎలా చెబుతారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.