Ivana | ఆ.. చేదు అనుభవాలు ఫేస్ చేశా.. ఇవానా పబ్లిగ్గా చెప్పేసింది

Ivana | హీరోయిన్‌గా కెరియర్ మొదలుపెట్టే వాళ్ళంతా తొలినాళ్ళలో కాస్త వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉంటారు. ఇది పాతకాలంలో లేదా.. అంటే అప్పుడూ ఇలాంటి పరిస్థితులే ఉన్నా, తప్పుకుంటూ పోయేవాళ్ళు కొందరైతే, ఎదిరించి ఎదురు దెబ్బలు తిన్నవాళ్ళున్నారు. మరికొందరు అయితే ఇప్పట్లా అప్పుడు పెద్ద ప్రచారం లేదు కాబట్టి కొందరు హీరోయిన్స్ చెప్పా పెట్టకుండా తెరమరుగు అయ్యేవాళ్ళు. అయితే అప్పటికీ ఇప్పటికీ హీరోయిన్స్‌కి బాడీ షేమింగ్, నటన పరంగా వంకలు, అవమానాల విషయంలో పెద్దగా మార్పు ఏం రాలేదు. […]

  • By: krs    latest    Aug 10, 2023 1:25 AM IST
Ivana | ఆ.. చేదు అనుభవాలు ఫేస్ చేశా.. ఇవానా పబ్లిగ్గా చెప్పేసింది

Ivana |

హీరోయిన్‌గా కెరియర్ మొదలుపెట్టే వాళ్ళంతా తొలినాళ్ళలో కాస్త వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉంటారు. ఇది పాతకాలంలో లేదా.. అంటే అప్పుడూ ఇలాంటి పరిస్థితులే ఉన్నా, తప్పుకుంటూ పోయేవాళ్ళు కొందరైతే, ఎదిరించి ఎదురు దెబ్బలు తిన్నవాళ్ళున్నారు. మరికొందరు అయితే ఇప్పట్లా అప్పుడు పెద్ద ప్రచారం లేదు కాబట్టి కొందరు హీరోయిన్స్ చెప్పా పెట్టకుండా తెరమరుగు అయ్యేవాళ్ళు.

అయితే అప్పటికీ ఇప్పటికీ హీరోయిన్స్‌కి బాడీ షేమింగ్, నటన పరంగా వంకలు, అవమానాల విషయంలో పెద్దగా మార్పు ఏం రాలేదు. ఇప్పటి రోజుల్లో ఇది మరికాస్త పెరిగింది కూడా.. అలాంటి విషయాలను ఏ హీరోయిన్ కూడా బయట పెట్టడానికి ఇష్టపడదు. కొద్దిగా పేరు వచ్చాకా అప్పుడు మాత్రమే చెబుతూ ఉంటారు. తాజాగా తను కూడా ఈ బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని తన చేదు అనుభవాలను ఏకరువు పెట్టింది ఆ హీరోయిన్.. విషయంలోకి వెళితే..

ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో రూపొందిన ‘లవ్ టుడే’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ఇవానా తన మొదటి సినిమాతోనే ఎందరో ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది.

ఈ సినిమా కూడా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, పెద్ద విజయాన్ని అందుకుంది. ఇక అక్కడి నుంచి ప్రతి హీరో తమ సినిమాలో ఇవానా ఉండాల్సిం దేనని డిమాండ్ చేసేంతలా ఛాయిస్ మారింది.

తాజాగా ఇవానా ‘రౌడీ బాయ్స్’ ఫేం ఆశిష్ రెడ్డితో ‘సెల్ఫిష్’ సినిమా చేస్తుంది. తాజాగా ఆమె క్రికెటర్ ఎమ్.ఎస్. ధోని నిర్మించిన LGM సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. గతంలోని కొన్ని చేదు అనుభవాల గురించి ఆమె పంచుకుంది.

ఓ స్టార్ హీరో సినిమాకు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చినపుడు ఆమె పొట్టిగా ఉందనే విషయంగా ఆ అవకాశం పోయిందట. పొడవు తక్కువనే కారణంగా ఇండస్ట్రీలో చాలా అవమానాలను ఎదుర్కొందట ఇవానా. మొదటి సినిమా లవ్ టుడే చేస్తున్న టైంలోనూ తన పొడవు గురించిన కామెంట్స్ చేసి బాధించిన సమయాలున్నాయట.

అయితే ఇలాంటి కామెంట్స్‌కి చిన్నతనం నుంచే తను అలవాటు పడిపోవడంతో అవేం పట్టించుకోకుండా తన పని తను చేసుకుందట. ఇప్పుడీ విషయాన్ని ఇవానా బయటపెట్టడంతో.. అంతా ఆమె ఘట్స్‌ని మెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఇండస్ట్రీలో చాలామంది పడుతున్నా ముందుకు వచ్చి చెప్పే ప్రయత్నం చేయరు. ఇవానాలా ఇంకెందరో ఇండస్ట్రీలో ఉన్న మాట మాత్రం వాస్తవం.