అప్పుల బాధ తాళలేక.. కుటుంబం ఆత్మహత్యా యత్నం
భర్త మృతి, భార్య పరిస్థితి విషమం చికిత్స పొందుతున్న చిన్నారులు విధాత, నిజామాబాద్: అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకరు మృతి చెందగా ముగ్గురు చికిత్స పొందుతున్నారు. దీంతో నిజామాబాదు జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జాన్కంపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భర్త, భార్య, ఇద్దరు కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. గొడ్డెళ్ల సాయిలు (42) చికిత్స […]

- భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
- చికిత్స పొందుతున్న చిన్నారులు
విధాత, నిజామాబాద్: అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకరు మృతి చెందగా ముగ్గురు చికిత్స పొందుతున్నారు. దీంతో నిజామాబాదు జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. జాన్కంపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భర్త, భార్య, ఇద్దరు కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. గొడ్డెళ్ల సాయిలు (42) చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందగా అతని భార్య రేఖ పరిస్థితి విషమంగా ఉంది. కాగా కుమారులు అరుణ్(13), రాంచరణ్ (10) నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గొడ్డెళ్ల సాయిలు జాన్కంపేట గ్రామంలో రాళ్లు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్య రేఖ రోజు వారీగా పని చేసుకుంటుండగా ఇద్దరు పిల్లలు అరుణ్, రాంచరణ్ చదువుకుంటున్నారు. వారికి గ్రామంలో సొంత ఇల్లు కూడా లేదు. కుటుంబ జీవనం కోసం అప్పులు చేసి వాటిని తీర్చే దారిలేక రాత్రి పురుగుల మందు సేవించారు.
విషయం తెలుసుకున్న కాలనీ వాసులు వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయిలు మృతి చెందగా ప్రాణాపాయ స్థితిలో వున్న అతని భార్య రేఖ, కుమారులు ముగ్గురు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎడపల్లి ఎస్ఐ పాండేరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.