Mancherial | వ్యాన్ ఢీ కొట్టి తండ్రీ కొడుకు మృతి
Mancherial | మద్యం మత్తు, అతివేగంతోనే ప్రమాదం విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు రహదారిపై గురువారం బస్సు కోసం ఎదురుచూస్తున్నవారిని అతివేగంగా వచ్చిన వ్యాను ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి చెందారు. సాయి, మంజుల దంపతులు పదేళ్ల కుమారునితో పాటు సిద్ధిపేట నుండి కలమడుగు సమీపంలోని రేండ్లగూడకు పనుల కోసం వలస వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. స్వగ్రామం సిద్దిపేటకు వెళ్ళడానికి రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. కొడుకు తాగునీరు […]

Mancherial |
- మద్యం మత్తు, అతివేగంతోనే ప్రమాదం
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు రహదారిపై గురువారం బస్సు కోసం ఎదురుచూస్తున్నవారిని అతివేగంగా వచ్చిన వ్యాను ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి చెందారు.
సాయి, మంజుల దంపతులు పదేళ్ల కుమారునితో పాటు సిద్ధిపేట నుండి కలమడుగు సమీపంలోని రేండ్లగూడకు పనుల కోసం వలస వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. స్వగ్రామం సిద్దిపేటకు వెళ్ళడానికి రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురుచూస్తున్నారు.
కొడుకు తాగునీరు కావాలంటే.. తల్లి వెళ్లింది. ఇదే సమయంలో మద్యంమత్తులో అతివేగంగా నడుపుతున్న వ్యాన్ డ్రైవర్.. రోడ్డుపై బస్సు కోసం ఎదురు చూస్తున్న తండ్రీకొడుకును ఢీకొట్టి, రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది.
ప్రమాదంలో సాయి (36), పదేళ్ల కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. కళ్లెదుటే భర్త, కొడుకును వ్యాన్ ఢీ కొట్టి మృతి చెందడంతో మంజుల రోదనలు మిన్నంటాయి. జన్నారం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.